Monday, 08 December 2025 04:42:22 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Keerthy Suresh: 15 ఏళ్ల ప్రేమ.. పెళ్లి ఆలస్యంపై అసలు కారణం చెప్పిన కీర్తి సురేశ్‌

Date : 13 October 2025 06:24 PM Views : 101

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : భర్త ఆంథోనీ తటిల్‌తో 15 ఏళ్ల ప్రేమాయణం కాలేజీ రోజుల నుంచే ప్రేమలో ఉన్న జంట కెరీర్‌లో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం మతం గురించి ఇంట్లో చెప్పడానికి మొదట భయపడ్డానన్న కీర్తి నాన్నకు చెప్పగానే వెంటనే ఒప్పుకున్నారని వెల్లడి సినీ హీరోయిన్ కీర్తి సురేశ్‌ తన ప్రేమ, పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను ప్రేమించిన ఆంథోనీ తటిల్‌తో గతేడాది ఆమె వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, కాలేజీ రోజుల్లో మొదలైన తమ ప్రేమ పెళ్లి వరకు చేరడానికి ఏకంగా 15 సంవత్సరాలు ఎందుకు పట్టిందో ఆమె తాజాగా వివరించారు. ప్రముఖ నటుడు జగపతిబాబు నిర్వహిస్తున్న ఓ టాక్‌ షోలో కీర్తి తన ప్రేమ ప్రయాణం వెనుక ఉన్న కథను బయటపెట్టారు. తామిద్దరం 2010లోనే, కాలేజీ చదువుతున్న రోజుల్లోనే ప్రేమలో పడ్డామని కీర్తి సురేశ్‌ తెలిపారు. "అయితే, ముందు నా చదువు పూర్తి కావాలని భావించాను. అప్పటికి కెరీర్‌పై కూడా స్పష్టమైన ఆలోచన లేదు. జీవితంలో ఇద్దరం బాగా స్థిరపడిన తర్వాతే ఒక్కటవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నాం. అందుకే పెళ్లి విషయంలో కావాలనే సమయం తీసుకున్నాం" అని ఆమె వివరించారు. ఈ నిర్ణయం ప్రకారమే ఇద్దరూ తమ తమ కెరీర్‌లపై దృష్టి సారించినట్లు చెప్పారు. గత ఆరేళ్లుగా తాను సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నానని, అదే సమయంలో ఆంథోనీ ఖతార్‌లో ఆయిల్ పరిశ్రమకు సంబంధించిన వ్యాపారాలు చూసుకునేవారని కీర్తి గుర్తుచేసుకున్నారు. ఇద్దరూ కెరీర్‌లో నిలదొక్కుకున్న తర్వాత పెళ్లి గురించి ఇంట్లో చెప్పాలనుకున్నట్లు తెలిపారు. "అయితే, మతాల విషయంలో ఇంట్లో ఏమైనా అభ్యంతరాలు వస్తాయేమోనని మొదట కొంచెం భయపడ్డాను. కానీ, నాలుగేళ్ల క్రితం ధైర్యం చేసి మా నాన్న దగ్గరికి వెళ్లి ఆంథోనీ గురించి చెప్పాను. నేను ఊహించినట్లుగా ఆయన నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదు. చాలా సింపుల్‌గా మా పెళ్లికి ఒప్పుకున్నారు" అని కీర్తి సురేశ్‌ ఆనందంగా చెప్పారు. ఇలా పదిహేనేళ్ల పాటు రహస్యంగా సాగిన తమ ప్రేమకథకు, గతేడాది హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుని శుభం కార్డు వేశారు. ఆంథోనీకి కొచ్చి, చెన్నైలలో పలు వ్యాపారాలు ఉన్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :