Saturday, 07 March 2026 09:11:57 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Kammattom: అడుగడుగునా సస్పెన్స్ .. ఓటీటీకి మలయాళ థ్రిల్లర్!

Date : 01 September 2025 06:34 PM Views : 515

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మలయాళంలో రూపొందిన 'కమ్మట్టం' ప్రధానమైన పాత్రలో సుదేవ్ నాయర్ 6 ఎపిసోడ్స్ గా పలకరించనున్న సిరీస్ జీ 5 చేతికి ఓటీటీ హక్కులు ఈ నెల 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రతివారం ఓటీటీ ప్రేక్షకులు మలయాళం నుంచి థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ ఏమైనా వచ్చిందా అనే ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే మలయాళం దర్శకులు ఈ తరహా కథలను చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తారు. క్రైమ్ జరిగిన తీరు .. ఇన్వెస్టిగేషన్ జరిగే విధానం .. నేరస్థులు తప్పించేకునే పద్ధతి ఇవన్నీ కూడా ప్రేక్షకులను అలా కూర్చోబెట్టేస్తాయి. అందువలన ఈ తరహా కంటెంట్ కోసం ఆత్రుతగా ఉంటారు. అలాంటి ప్రేక్షకుల కోసం ఈ వారం ఒక మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. 'కమ్మట్టం' అనే టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ పలకరించనుంది. షాన్ తులసీ ధరన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను, ఈ నెల 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. 6 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కేరళ పరిసర ప్రాంతాలలో ఈ కథ నడుస్తుంది. సుదేవ్ నాయర్ .. జియో బేబీ ప్రధానమైన పాత్రలను పోషించారు. శామ్యూల్ ఉమ్మన్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. అందరూ కూడా మిగతా రోడ్డు ప్రమాదాల మాదిరిగానే ఈ సంఘటన కూడా జరిగిందని అనుకుంటారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ ఆఫీసర్ ఆంటోనియా జార్జ్ మాత్రం, ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదనే అనుమానం కలుగుతుంది. ఈ విషయంలో అతను అనుమానించిన ఆటో డ్రైవర్ కూడా హఠాత్తుగా చనిపోతాడు. అప్పుడు జార్జ్ ఏం చేస్తాడు? అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేది కథ. యథార్థ సంఘటనల ప్రేరణతో రూపొందిన ఈ సిరీస్ ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :