Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Bigg Boss Nainika : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయిదు వారాలు పూర్తి అయింది. ఐదో వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ గా ఆదిత్య ఎలిమినేట్ అయితే నిన్న ఆదివారం ఎపిసోడ్ లో నైనిక ఎలిమినేట్ అయింది. ఢీ షోలో డ్యాన్సర్ గా పాపులారిటీ తెచ్చుకున్న నైనిక ఇప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూనే నటిగా మారుతుంది. నైనిక బిగ్ బాస్ లో మరింత ముందుకెళ్లాలని ఆమె తల్లి బయట ప్రమోషన్స్ బాగానే చేసింది. ఈ క్రమంలో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నైనిక తల్లి మాట్లాడుతూ.. నైనిక బిగ్ బాస్ కి వెళ్ళాలి అని ఎప్పట్నుంచో అనుకుంది. సడెన్ గా ఛాన్స్ వచ్చేసరికి మొదట నేను నమ్మలేదు కానీ ఇప్పుడు సంతోషంగా ఉంది. నైనికకు గణేష్ మాస్టర్ వద్ద, జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఛాన్సులు వచ్చాయి. కానీ జానీ మాస్టర్ దగ్గరికి వద్దు అని శశి మాస్టర్ చెప్పడంతో ఆగిపోయాము. తను నటిగా కూడా మారాలి అనుకోవడంతో దాని వైపు కూడా ఫోకస్ చేస్తుంది. అప్పుడప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వెళ్లి వర్క్ చేస్తుంది అని తెలిపింది. మరి ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక నైనిక కొరియోగ్రాఫర్ గా మారుతుందా, నటిగా మారుతుందా చూడాలి. అయితే జానీ మాస్టర్ ఇష్యూ గత కొన్ని రోజులుగా వైరల్ అవుతుంటే ఇప్పుడు జానీ మాస్టర్ దగ్గర ఆఫర్ వచ్చినా వేరే డ్యాన్స్ మాస్టర్ వెళ్లొద్దు అని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Admin
Studio18 News