Sunday, 08 March 2026 04:16:12 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

OG Movie | పవన్‌ కల్యాణ్‌ ఓజీ సినిమా టికెట్ల ధరల పెంపుపై.. వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు

OG Movie | డిప్యూటీ సీఎం, పవర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా డిజాస్టర్‌ కావడంతో పవన్‌ కల్యాణ్‌ ఫ్య

Date : 20 September 2025 07:34 PM Views : 415

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : OG Movie | డిప్యూటీ సీఎం, పవర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా డిజాస్టర్‌ కావడంతో పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ అంతా ఈ సినిమాపైనే ఉన్నాయి. దీంతో ఈ సినిమాతో క్యాష్‌ చేసుకోవాలనుకున్న నిర్మాతలు.. ఏపీ ప్రభుత్వాన్ని కలిసి టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం.. టికెట్ల ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ.125, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 వరకు పెంచుకునేందుకు అవకాశమిచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల ధరల పెంపుపై ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ ఘాటుగా స్పందించారు. ఓజీ సినిమాకు అధిక టికెట్‌ ధర ఇచ్చినట్లే ఉల్లి రైతులకు, వరి రైతులకు, మిర్చి రైతులకు కూడా మద్దతు ధర కల్పిస్తున్నట్లు ఒక జీవో ఇవ్వొచ్చు కదా అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించారు. పెయిడ్‌ ఆర్టిస్టుకు లాభం కోసమే ప్రభుత్వ ఉత్తర్వులు కానీ పేదల కోసం, రైతుల కోసం కాదంటారా అని నిలదీశారు. ఈ మేరకు ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా ప్రశ్నించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :