Saturday, 24 January 2026 03:05:20 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Deepika Padukone: నాకు డబ్బులు ముఖ్యం కాదు: దీపికా పదుకొణె

Date : 19 November 2025 06:44 PM Views : 104

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : డబ్బు, బడ్జెట్ తన నిర్ణయాన్ని ప్రభావితం చేయవన్న దీపిక ఆరోగ్యకరమైన పని వాతావరణానికే తన మొదటి ప్రాధాన్యత అని వెల్లడి రోజుకు 8 గంటల పనివిధానం ఉండాలని వ్యాఖ్య బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకొణె ఇటీవల రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులను తిరస్కరించడంపై స్పష్టత ఇచ్చారు. ప్రభాస్ హీరోగా రానున్న 'కల్కి' సీక్వెల్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని 'స్పిరిట్' సినిమాల్లో నటించకపోవడానికి కారణం పారితోషికం లేదా డేట్స్ కాదని, ఆరోగ్యకరమైన పని వాతావరణానికే తన తొలి ప్రాధాన్యత అని ఆమె వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన నిర్ణయంపై వస్తున్న విమర్శలకు దీపికా సమాధానమిచ్చారు. "సినిమా బడ్జెట్ రూ.100 కోట్లా లేక రూ.500-600 కోట్లా అనేది నా నిర్ణయాలపై ప్రభావం చూపదు. కొందరు భారీ పారితోషికం ఆఫర్ చేస్తారు. కానీ నాకు అది ముఖ్యం కాదు" అని ఆమె తెలిపారు. సినిమా స్థాయిని బట్టి తన ప్రాధాన్యతలు మారవని ఆమె పరోక్షంగా వెల్లడించారు. ఆరోగ్యకరమైన పని వాతావరణం ఉన్నప్పుడే ఉత్తమమైన నటనను ఇవ్వగలమని దీపిక పేర్కొన్నారు. "ప్రతిరోజూ ఎనిమిది గంటల పనివేళలు సరిపోతాయి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన పనిలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలం" అని ఆమె వివరించారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, దీపికా పదుకొణె ఇటీవలే ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'లో కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రంలో (AA22xA6) కథానాయికగా నటిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :