Thursday, 12 March 2026 03:42:35 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Gorre Puranam : తెలుగు ఓటీటీ ఆహాలో మరో కొత్త సినిమా.. సుహాస్ ‘గొర్రె పురాణం’.. ఎప్పట్నించి అంటే..

Date : 08 October 2024 10:44 AM Views : 273

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Gorre Puranam : తెలుగు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓటీటీ ఆహా. ఓటీటీ మొదలయిన దగ్గర్నుంచి రెగ్యులర్ గా కొత్త సినిమాలు, పలు రకాల షోలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రతి వారం డైరెక్ట్ కొత్త సినిమాలను తీసుకొస్తుంది. అంతేకాకుండా డబ్బింగ్ సినిమాలు కూడా తీసుకొస్తుంది తెలుగు ప్రేక్షకుల కోసం. తాజాగా మరో కంటెంట్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. సుహాస్ హీరోగా ఫోకల్ వెంచర్స్ బ్యానర్ పై బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘గొర్రె పురాణం’. ఇటీవల సెప్టెంబర్ 20న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజయింది. ఇప్పుడు ఆహా ఓటీటీలోకి రానుంది గొర్రె పురాణం సినిమా. ఈ సినిమా ఆహా ఓటీటీలో దసరా కానుకగా అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. సుహాస్ హీరోగా మొదటి సినిమా కలర్ ఫోటో డైరెక్ట్ ఆహా ఓటీటీలోనే రిలీజయి భారీ విజయం సాధించి నేషనల్ అవార్డు కూడా అందుకుంది. అప్పట్నుంచి వరుసగా ప్రయోగాలు చేస్తూ కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ హిట్స్ కొడుతున్నాడు సుహాస్. ఇప్పుడు గొర్రె పురాణం సినిమాతో థియేటర్స్ లో పలకరించగా మళ్ళీ తనకు కలిసొచ్చిన ఆహాలో ప్రేక్షకులని అలరించబోతున్నాడు. సినిమా ఆహా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం సినిమాపై మేము ఇష్టంతో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామంటే ఆహా లాంటి వేదికలు మాకు సపోర్ట్ చేయడమే కారణం అని అన్నారు. ఒక ఊళ్ళో ఓ గొర్రె వల్ల రెండు మతాల మధ్య గొడవలు వస్తే ఏం జరిగింది, సుహాస్ కి ఆ గొర్రెకు సంబంధం ఏంటి అనే కథాంశంతో ఈ గొర్రె పురాణం సినిమాని తెరకెక్కించారు. గొర్రెకు తరుణ్ భాస్కర్ వాయిస్ ఇవ్వడం గమనార్హం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :