Thursday, 12 March 2026 04:32:16 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

తెలంగాణ ప్ర‌భుత్వానికి వైజ‌యంతి మూవీస్‌, పింక్ ఎలిఫెంట్ నిర్మాణ సంస్థ‌లు థ్యాంక్స్

Date : 29 May 2025 02:58 PM Views : 368

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఈరోజు గద్దర్ అవార్డులను ప్ర‌క‌టించింది. దాదాపు 14 ఏళ్ల త‌ర్వాత ఈ అవార్డుల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇందులో ప‌లు చిత్రాలు అవార్డులు కొల్ల‌గొట్టాయి. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వానికి ఆయా చిత్రాల నిర్మాణ సంస్థ‌లు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబోలో వ‌చ్చిన 'క‌ల్కి 2898 ఏడీ' గ‌ద్ద‌ర్ అవార్డుల‌లో ఉత్త‌మ చిత్రంగా నిలిచిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ వైజ‌యంతి మూవీస్ స్పందించింది. తెలంగాణ‌ ప్ర‌భుత్వానికి థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టింది. చిత్ర బృందాన్ని ప్రోత్స‌హించినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపింది. అలాగే 'క‌మిటీ కుర్రాళ్లు' చిత్రానికి గాను డైరెక్ట‌ర్‌ య‌ధువంశీకి ఉత్త‌మ ప‌రిచ‌య ద‌ర్శ‌కుడు అవార్డు ద‌క్కింది. త‌మ చిత్ర ద‌ర్శ‌కుడికి అవార్డు ఇచ్చినందుకు నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్ తెలంగాణ స‌ర్కార్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. " 'క‌మిటీ కుర్రాళ్లు' టీమ్‌కు ఇదోక మైలురాయి. తెలంగాణ ప్ర‌భుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి ధ‌న్య‌వాదాలు. మా శ్ర‌మ‌ను గుర్తించినందుకు గ‌ద్ద‌ర్ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ స‌భ్యుల‌కు కృత‌జ్ఞ‌త‌లు. ఈ గుర్తింపు మా గౌర‌వాన్ని మ‌రింత పెంచింది" అని పోస్ట్ చేసింది. ఇక‌, 'ఆయ్' సినిమా ఉత్త‌మ ప్ర‌జాదర‌ణ పొందిన మూవీగా నిలిచింది. దీంతో చిత్రం యూనిట్ తెలంగాన ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఈ క్ష‌ణాల‌ను ఎప్ప‌టికీ మ‌రిచిపోలేమ‌ని తెలిపింది. నాలుగు అవార్డులు కొల్ల‌గొట్టిన ల‌క్కీ భాస్క‌ర్‌ ఇవాళ ప్ర‌క‌టించిన గ‌ద్ద‌ర్ అవార్డుల్లో దుల్క‌ర్ స‌ల్మాన్‌, వెంకీ అట్లూరి కాంబోలో వ‌చ్చిన‌ 'ల‌క్కీ భాస్క‌ర్' ప్రభంజ‌నం సృష్టించింది. ఏకంగా నాలుగు అవార్డులు (ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ స్క్రీన్‌ప్లే, ఉత్త‌మ ఎడిట‌ర్‌) కొల్ల‌గొట్టింది. ఇది టీమ్‌కు ఎంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పేర్కొంది. ఈ మూవీని ఆద‌రించిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసింది. అలాగే తెలంగాణ ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :