Monday, 19 January 2026 08:10:35 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Game Changer : ద‌స‌రాకి రామ్‌చ‌ర‌ణ్ ‘గేమ్‌ఛేంజ‌ర్’ టీజ‌ర్ లేన‌ట్టే..? త‌మ‌న్ ట్వీట్‌తో ఫ్యాన్స్‌లో నిరాశ‌..

Date : 08 October 2024 02:45 PM Views : 229

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Game Changer : గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజ‌ర్‌’. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రం డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. ఈ చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ ఈ చిత్ర అప్డేట్ ల‌ను ఇస్తూ వ‌స్తున్నాడు. ఇప్ప‌టికే రెండు పాట‌లు.. ‘జ‌ర‌గండి’, ‘రా మ‌చ్చా మ‌చ్చా’ పాట‌లను విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇక మూడో పాట‌ను అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే త‌మ‌న్ చెప్పేశాడు. ద‌స‌రాకు ఈ మూవీ నుంచి టీజ‌ర్ వ‌స్తుంద‌ని ఎంతో మంది ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. అయితే.. వారికి త‌మ‌న్ షాకిచ్చాడు. అత‌డి ట్వీట్ చూస్తుంటే ద‌స‌రాకు టీజ‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ‘‘దసరాకు టీజర్‌ రాలేదని నిరాశపడొద్దు ఫ్రెండ్స్‌. టీమ్‌ నిరంతరం ఆ పనుల్లోనే ఉంది. సీజీ, వీఎఫ్‌ఎక్స్‌ ఫైనల్‌ ఎడిటింగ్‌, డబ్బింగ్‌, బ్యాక్‌గ్రౌండ్‌ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రతినెలా ఒక లిరికల్‌ పాటను విడుదల చేయడం కోసం అన్ని పాటలకు లిరిక్స్‌ వర్క్స్‌ పూర్తి చేశాం. మూడో సాంగ్ ఈ నెల (అక్టోబ‌ర్) 30న ప్రేక్ష‌కుల వ‌స్తుంది.’ అని త‌మ‌న్ ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమా డిసెంబ‌ర్ 20న లేదంటే క్రిస్‌మ‌స్ రోజున ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు తెలిపాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :