Saturday, 24 January 2026 07:43:37 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Sridevi: 'బాహుబలి' ఆఫర్ ను శ్రీదేవి ఎందుకు వదులుకుందో చెప్పిన బోనీ కపూర్

Date : 06 September 2025 06:26 PM Views : 363

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : బాహుబలి శివగామి పాత్రపై బోనీ కపూర్ కీలక వ్యాఖ్యలు శ్రీదేవికి నిర్మాతలు తక్కువ పారితోషికం ఆఫర్ చేశారని వెల్లడి ఆమె భారీ డిమాండ్లు చేశారని రాజమౌళికి తప్పుడు సమాచారం ఇచ్చారన్న బోనీ నిర్మాత శోభు యార్లగడ్డపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైనం ఏళ్లనాటి వివాదంపై స్పష్టతనిస్తూ శ్రీదేవి ప్రొఫెషనలిజంను సమర్థన భారత సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి’ చిత్రంలో శివగామి పాత్రను దివంగత నటి శ్రీదేవి ఎందుకు తిరస్కరించారనే అంశంపై ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తెరదించారు. శ్రీదేవి భారీ డిమాండ్లు చేశారంటూ వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ‘బాహుబలి’ నిర్మాతలు ఆమెకు తక్కువ పారితోషికం ఆఫర్ చేయడమే కాకుండా, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిని తప్పుదోవ పట్టించారని సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ఒక యూట్యూబ్ షోలో పాల్గొన్న బోనీ కపూర్ ఈ విషయాలను వెల్లడించారు. అసలు జరిగిందేమిటంటే..! ‘గేమ్ చేంజర్స్’ అనే యూట్యూబ్ షోలో బోనీ కపూర్ మాట్లాడుతూ, "రాజమౌళి గారు మా ఇంటికి వచ్చి శ్రీదేవికి కథ వివరించారు. ఆయనపై మాకు ఎంతో గౌరవం ఉంది. ఆయన వెళ్లిపోయిన తర్వాత, నిర్మాతలు పారితోషికం విషయం ప్రస్తావించారు. అప్పటికే ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ వంటి విజయవంతమైన చిత్రంలో నటించిన శ్రీదేవికి, ఆ సినిమా కంటే తక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారు. శ్రీదేవి అప్పటికే ఒక స్టార్, ఆమె ఏమీ సమస్యల్లో ఉన్న నటి కాదు. ఆమె పేరుతో సినిమాకు హిందీ, తమిళ మార్కెట్లలో ప్రచారం లభిస్తుంది. అలాంటప్పుడు ఆమెను అంత తక్కువ చేసి ఎందుకు అడగాలి?" అని బోనీ కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తమను అవమానించినట్లుగా అనిపించిందని ఆయన స్పష్టం చేశారు. రాజమౌళిని తప్పుదోవ పట్టించారు! నిర్మాతలు శ్రీదేవికి ఎంత ఆఫర్ చేశారనే నిజాన్ని రాజమౌళికి చెప్పకుండా దాచిపెట్టారని బోనీ కపూర్ ఆరోపించారు. "నిర్మాతలు రాజమౌళి దగ్గరకు వెళ్లి, శ్రీదేవి హోటల్‌లో ఒక ఫ్లోర్ మొత్తం కావాలని, పెద్ద ఎత్తున సిబ్బంది కావాలని డిమాండ్ చేసినట్లు అబద్ధాలు చెప్పారు. మేము కేవలం మా పిల్లల స్కూల్ సెలవులకు అనుగుణంగా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేయమని మాత్రమే కోరాము. అంతకుమించి ఎలాంటి అహేతుకమైన డిమాండ్లు చేయలేదు. ఈ నిర్మాతలు రాజమౌళిని పూర్తిగా తప్పుదోవ పట్టించారు," అని ఆయన పేర్కొన్నారు. శ్రీదేవి ప్రొఫెషనలిజంను ప్రశ్నించడాన్ని తప్పుబడుతూ, "రాకేష్ రోషన్, యశ్ చోప్రా, రాఘవేంద్రరావు వంటి దిగ్గజ దర్శకులు ఆమెతో పదే పదే ఎందుకు సినిమాలు చేశారు? ఆమె ప్రొఫెషనల్ కాకపోతే ఇది సాధ్యమయ్యేదా?" అని బోనీ కపూర్ ప్రశ్నించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :