Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Jabardasth : తెలుగు టీవీ షో జబర్దస్త్ ఎన్నో ఏళ్లుగా కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకులని మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జబర్దస్త్ లో ఇటీవల అందరూ మారుతున్నారు. ఎంతో మంది కమెడియన్స్, జడ్జీలు, యాంకర్లు వచ్చి వెళ్తున్నారు. రోజా – నాగబాబు వెళ్ళిపోయాక రెగ్యులర్ గా జడ్జీలు, యాంకర్లు మారుతూనే ఉన్నారు. ప్రస్తుతం జబర్దస్త్ వారానికి రెండు ఎపిసోడ్స్ గా వస్తుండగా కొన్నాళ్లుగా కృష్ణ భగవాన్, కుష్బూ జడ్జీలుగా చేసారు. కానీ ఇటీవల కృష్ణ భగవాన్ స్థానంలో శివాజీ వచ్చారు. తాజాగా కుష్బూ స్థానంలోకి ఒకప్పటి హీరోయిన్ లయ వచ్చింది. ఒకప్పుడు హీరోయిన్ గా అనేక సినిమాలతో మెప్పించిన లయ పెళ్లి తర్వాత అమెరికా వెళ్ళిపోయి సెటిలయింది. మళ్ళీ ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తుంది. ఇలాంటి సమయంలో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. శివాజీ కూడా బిగ్ బాస్ తో రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వరుస సినిమాలు, సిరీస్ లు, షోలతో దూసుకుపోతున్నాడు. శివాజీ – లయ గతంలో మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం.. సినిమాలలో కలిసి నటించి మెప్పించి హిట్లు కొట్టారు. వీరిద్దరిది వెండితెరపై మంచి పెయిర్. ఇప్పుడు ఈ జంట జబర్దస్త్ లో జడ్జీలుగా రావడంతో ప్రేక్షకులలో ఈ షోపై మరింత ఆసక్తి నెలకొంది. లయ జడ్జిగా వచ్చిన ఎపిసోడ్ ప్రోమో తాజాగా రిలీజ్ చేసారు.
Admin
Studio18 News