Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : టాలీవుడ్ నటుడు శ్రీతేజ్‌పై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని అతనిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీతేజ్‌పై బీఎన్‌ఎస్ 69, 115 (2), 318 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, గతంలోనూ శ్రీతేజ్‌పై ఇదే పీఎస్‌లో కేసు నమోదైంది. పెళ్లయిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడంతో ఆమె భర్త గుండెపోటుతో మృతిచెందినట్టు అప్పట్లో వివాదం చెలరేగింది. కాగా, శ్రీతేజ్ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో చంద్రబాబు రోల్ చేసిన విషయం తెలిసిందే. అలాగే 'ధమాకా', 'పుష్ప ది రైజ్', 'వంగవీటి', 'మంగళవారం', తదితర సినిమాలలో కీలక పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'పుష్ప ది రూల్' చిత్రంలోనూ ఓ పాత్ర పోషించాడు.
Also Read : ఐపీఎల్ వేలం... నితీశ్ రాణాను రూ.4.20 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్
Admin
Studio18 News