Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ముంబై హీరోయిన్ జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు క్రాంతి రాణా తాతా, విశాల్ గున్ని, దర్యాప్తు అధికారి సత్యనారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా... తాజాగా ఈ కేసును సీఐడీకి అప్పగించారని, కౌంటర్లు వేసేందుకు సమయం ఇవ్వాలని కోర్టును పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. కేసు డిస్పోజ్ అయ్యేంత వరకు పోలీస్ అధికారులకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. ఈ క్రమంలో తదుపరి విచారణను ఈ నెల 23కు హైకోర్టు వాయిదా వేసింది.
Admin
Studio18 News