Saturday, 17 January 2026 08:40:52 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

ఆ రోజు నేను పొగడలేదు... కోప్పడ్డాను: త్రివిక్రమ్ శ్రీనివాస్

Date : 13 May 2025 12:01 PM Views : 323

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని గురించి కొంతకాలం క్రితం ఓ వేడుకలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ప్రసంగం వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈటీవీలో ప్రసారమవుతున్న 'నా ఉచ్ఛ్వాసం కవచం' అనే కార్యక్రమంలో ఇదివరకే పలువురు ప్రముఖులు సిరివెన్నెలతో తమకున్న అనుబంధాన్ని పంచుకోగా, తాజా ఎపిసోడ్‌లో త్రివిక్రమ్ పలు విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామశాస్త్రిపై గతంలో తాను చేసిన ప్రసంగంపై స్పందిస్తూ.. ఆ రోజు తాను సిరివెన్నెలను పొగడలేదని, ఆయనపై కోప్పడ్డానని చెప్పారు. అలా ఎందుకు మాట్లాడారో త్రివిక్రమ్ వివరించారు. చాలామంది ఆయన్ను (సీతారామశాస్త్రి) తాను ప్రశంసించానని అనుకున్నారని, కానీ పొగడలేదని త్రివిక్రమ్ అన్నారు. పొగడ్తలో కొంచెం డ్రామా, కొంచెం అతిశయోక్తి ఉంటాయన్నారు. తాను నిజమే మాట్లాడానని, అందుకే ఆ ప్రసంగం ఎక్కువమందికి నచ్చిందన్నారు. సినిమా స్థాయిని ఆయన పెంచారని పేర్కొన్నారు. ఎంతో ప్రతిభ ఉన్నా సినిమా పాట వల్ల ఆయన అక్కడే బందీ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కలిసినప్పుడు ఎన్నో అంశాల గురించి చర్చించుకునేవాళ్లమని అన్నారు. విషయం ఏదైనా ఆయన లోతుగా ఆలోచిస్తారని చెప్పారు. ఆయన వ్యాసాలు రాసేవారని చాలామందికి తెలియదన్నారు. ‘చిలకా ఏ తోడు లేక’ లాంటి పాటలను ఆయన చాలా అలవోకగా రాసేవారని అన్నారు. ఆయన ఇంకా ఎంతో చేయగలిగిన వ్యక్తి అని, కానీ అప్పట్లో అవకాశాలు, తెలుగు సినిమా పరిధి తక్కువని అన్నారు. అందుకే ఆయన విషయంలో తనకు చాలా బాధ, కోపం ఉండేవని, దానినే ఆ రోజు చూపించానని త్రివిక్రమ్ వివరించారు. తాము బంధువులుగా ఎప్పుడూ భావించలేదని, ఆయన్ను సర్ అని సంబోధించేవాడినని, ఆయన శ్రీను అని పిలిచేవారని నాటి జ్ఞాపకాలను త్రివిక్రమ్ గుర్తు చేసుకున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :