Monday, 08 December 2025 03:18:08 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

'స్వ‌యంభు' వ‌చ్చే వ‌ర‌కూ న‌భా క‌విత‌లేనా?

.. చాలా నేచుర‌ల్ గా స‌హ‌జ‌సిద్ధంగా ప్ర‌కృతి అందాల నడుమ ఒదిగిపోయి క‌నిపించింది న‌భా. వైట్ ఫ్రాక్ లో గుబులు రేపేంత అందంగా క‌నిపిస్తోంది.

Date : 30 October 2025 08:04 PM Views : 243

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సాయంత్రం వెలుగులో నన్ను వెతుక్కుందాం.. నా ముఖంలో చిరునవ్వుతో, నా హృదయంలో వెచ్చదనంతో.. కూర్చుని ఆకాశ సౌందర్యం గురించి మాట్లాడుకుందాం.. గాలితో ఊపిరి పీల్చుకుందాం.., మేఘాల నీడలో విశ్రాంతి తీసుకుందాం.. సూర్యాస్తమయంలో మారుతున్న రంగుల్లో నవ్వుకుందాం.. ఎప్ప‌టికీ నన్ను వెతుక్కుందాం..

ఎవ‌రిలో ఇంత సొగ‌సైన క‌విత్వం పొంగి పొర్లుతోంది? ఏమో! అది న‌భా న‌టేష్ కావొచ్చు. ఈ క‌న్న‌డ బ్యూటీ టాలీవుడ్ లో అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచి కెరీర్ ప‌రంగా వ‌రుసగా అవ‌కాశాలు అందుకుంటూనే ఉంది. కానీ ఊహించ‌ని విధంగా కెరీర్ దూసుకెళుతున్న స‌మ‌యంలోనే ఒకే ఒక్క యాక్సిడెంట్ త‌న క‌ల‌ల్ని క‌ల్ల‌లు చేసేస్తుంద‌ని భ‌య‌ప‌డిన‌ట్టు చెప్పుకొచ్చింది న‌భా. అప్ప‌ట్లో త‌న కెరీర్ గురించి చాలా ఆందోళ‌న చెందింది. అయితే చూస్తుండ‌గానే అంతా మారిపోయింది. తాను అనుకున్న విధంగా కంబ్యాక్ అయింది. ఇప్పుడు ద‌ర్శ‌క‌నిర్మాత‌లను ఆక‌ర్షించ‌డంలో రేసులో ముందుంది. ఈరోజు ఉన్న‌ది రేపు ఉండ‌దు.. రేపు ఉన్న‌ది ఆ త‌ర్వాత ఉండ‌దు.. ప్ర‌తి రోజూ మారిపోతూనే ఉంటుంది. లైఫ్ అంటే ఇదే కదా.. అయితే కొంచెం ఓపిక స‌హ‌నం అవ‌స‌రం. కాలంతో పాటే మార్పు ఉంటుంద‌ని గ్ర‌హించి స‌హ‌నంతో ఎదురు చూడాలి. ఇప్పుడు తాను వేచి చూసిన సమ‌యం రానే వ‌చ్చింది. తిరిగి ఎప్ప‌టిలానే న‌భా న‌టేష్ త‌న సొగ‌సైన రూపాన్ని తిరిగి పొందింది. బోయ్స్ ని క‌వ్వించే అందం చందం త‌న‌లో మెండుగా ఉన్నాయ‌ని చెప్ప‌క‌నే చెబుతోంది న‌భా ఇన్ స్టాలోని ప్ర‌తి పోస్ట్. ఎంతో అందంగా డిజైన‌ర్ లుక్కుల్లోకి ఒదిగిపోయి ఫోటోషూట్ల‌లో మిల‌మిల మెరిసిపోతోంది న‌భ‌. తాజాగా న‌భా న‌టేష్ షేర్ చేసిన ఓ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.

చాలా సింపుల్ గా.. చాలా నేచుర‌ల్ గా స‌హ‌జ‌సిద్ధంగా ప్ర‌కృతి అందాల నడుమ ఒదిగిపోయి క‌నిపించింది న‌భా. వైట్ ఫ్రాక్ లో గుబులు రేపేంత అందంగా క‌నిపిస్తోంది. మునుప‌టితో పోలిస్తే జిమ్ లో బాగా శ్ర‌మిస్తోంది. దీని ఫ‌లితం న‌భా ఎంతో స్లిమ్ గా టీనేజ‌ర్ ని త‌ల‌పిస్తోంది. ఈ మేకోవ‌ర్ నిజంగా స్ట‌న్నింగ్. హూ ఆర్ యు క్వీన్ న‌భా.. ఐ మిస్ యు! అంటూ ఒక అభిమాని ల‌వ్ ఈమోజీల‌ను షేర్ చేసాడు. చాలా మంది అభిమానులు న‌భా న‌టేష్ అంద‌చందాల‌కు మైమ‌రిచి పోతున్నామ‌ని చెబుతున్నారు. ల‌వ్ కిస్ ఫైర్ ఈమోజీల‌తో ఫ్యాన్స్ విరుచుకుప‌డుతున్నారు. తాజా ఫోటోషూట్ వెబ్‌లో మోంతా తుఫాన్ లా దూసుకెళుతోంది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. నిఖిల్ స‌ర‌స‌న `స్వ‌యంభు` అనే హిస్టారిక‌ల్ వారియ‌ర్ డ్రామా చిత్రంలో న‌టిస్తోంది. భ‌ర‌త్ కృష్ణ‌మాచారి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాపై న‌భా చాలా హోప్స్ పెట్టుకుంది. కొంత గ్యాప్ త‌ర్వాత త‌న‌కు బిగ్ బ్రేక్ ఇస్తుంద‌ని న‌భా ఆశిస్తోంది. న‌భాతో పాటు, సంయుక్త మీన‌న్ మ‌రో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :