Saturday, 24 January 2026 01:35:28 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

'జటాధర'- మూవీ రివ్యూ!

Date : 07 November 2025 06:33 PM Views : 157

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : కథను ఆవిష్కరించే విషయంలో తడబాటు ఉత్కంఠభరితంగా లేని సన్నివేశాలు కనెక్ట్ కాని ఎమోషన్స్ హడావిడికి పరిమితమైపోయిన గ్రాఫిక్స్ సుధీర్ బాబు ఎప్పటికప్పుడు కొత్త జోనర్ ను టచ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన గత చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం మనకి అర్థమైపోతూనే ఉంటుంది. 'జటాధర' సినిమా విషయంలోను ఆయన అదే పద్ధతిని కొనసాగించాడు. హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో, శిల్పా శిరోద్కర్ .. సోనాక్షి సిన్హా కీలకమైన పాత్రలను పోషించడం విశేషం. అలాంటి ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లలో విడుదలైంది. కథ: శివ (సుధీర్ బాబు) ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు. తనకంటూ ఒక మంచి జాబ్ ఉంటుంది. అయితే అతను మరో పనిపై కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాడు. అదేమిటంటే దెయ్యాలు లేవని నిరూపించడం. అలాంటి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టడం కోసం, దెయ్యాల బంగ్లాలుగా పేరుపడిన ప్రదేశాల చుట్టూ తిరుగుతుంటాడు. ఈ విషయంలో తల్లిదండ్రులు అతనిని వారిస్తూ ఉంటారు. ముఖ్యంగా అతను 'రుద్రారం' అనే విలేజ్ దిశగా వెళతాడేమోనని వాళ్లు ఆందోళన చెందుతుంటారు. శివకి తరచూ ఒక 'కల' వస్తూ ఉంటుంది. ఊయలలో పడుకున్న ఒక పసిబిడ్డను ఒక తల్లి కత్తితో చంపడానికి వస్తున్నట్టుగా అనిపించి అతను ఉలిక్కిపడి నిద్రలేస్తూ ఉంటాడు. అలా ఆ 'కల' ఎందుకు వస్తుందనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దెయ్యాల విషయంలో శివ దూకుడును అడ్డుకోవడానికి అతని తల్లిదండ్రులతో పాటు, మనసిచ్చిన 'సితార' కూడా అతనిని వారిస్తూ ఉంటుంది. అయినా అతను వాళ్లకి తెలియకుండా తన పనిని కొనసాగిస్తూనే ఉంటాడు. శివ కుటుంబం క్షేమాన్ని కోరుకునే నీలకంఠ శాస్త్రి (శుభలేఖ సుధాకర్), అతనికి మరణగండం ఉందని తెలుసుకుంటాడు. అదే సమయంలో శివ 'రుద్రారం' వెళతాడు. ఆ గ్రామంలో శివకి పరిచయమున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. ఒక మాంత్రికుడితో కలిసి అతను 'లంకెబిందెలు' తీయడానికి ప్రయత్నించగా, ఆ నిధికి కాపలాగా ఉన్న ధనపిశాచి (సోనాక్షి సిన్హా) అతనిని చంపేసిందనే వార్త శివకి తెలుస్తుంది. అక్కడ ఏం జరిగిందో పరిశోధించి బయట ప్రపంచానికి ఆ నిజం చెప్పాలనే ఉద్దేశంతో అతను ఆ గ్రామానికి వెళతాడు. అక్కడ ఏం జరుగుతుంది? ధనపిశాచి గురించి శివకి ఎలాంటి నిజం తెలుస్తుంది? అతని 'కల' వెనుక దాగిన నిజం ఏమిటి? అనేది మిగతా కథ. విశ్లేషణ: సాధారణంగా దెయ్యాల కథలు .. నిధి తాలూకు అన్వేషణకి సంబంధించిన కథలు .. దైవత్వానికి సంబంధించిన కథలు ఎప్పుడూ ఆసక్తికరంగానే అనిపిస్తూ ఉంటాయి. ఈ తరహా కథల పట్ల కుతూహలాన్ని కనబరిచేవారు ఎక్కువ. ఆసక్తికరమైన పై మూడు అంశాలను కలుపుకుని సుధీర్ బాబు చేసిన సినిమానే ఇది. ఈ కథలో నిధి ఉంది .. పిశాచి ఉంది .. ఆ పిశాచిని అడ్డుకునే కథానాయకుడు .. ఆయనకి సహకరించే దేవుడు ఉన్నారు. ఇక లేనిదల్లా ఎమోషన్ .. జరగనిదల్లా కథపై పూర్తిస్థాయి కసరత్తు. తెరపై కథానాయకుడు ఒక సమస్యను ఫేస్ చేస్తున్నప్పుడు, అందుకు పరిష్కార మార్గంగా అతను ఏం చేస్తున్నాడనేది ప్రేక్షకులకు తెలియాలి. అలా కాకుండా తాను ఏదో అనేసుకుని .. ఆ ప్లాన్ ను అరుణాచలంలోని అష్టలింగాలకు ముడిపెట్టడం, సామాన్య ప్రేక్షకులకు అయోమయాన్ని కలిగిస్తుంది. ఇక ఒక ధన పిశాచాన్ని కంట్రోల్ చేయడానికిగాను, కైలాసంలోని శివుడు కంగారుపడిపోయి నంది వాహనంపై కదిలిరావడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. హీరోకి ఫ్లాష్ బ్యాక్ తెలియజెప్పడం కోసం చాలా సమయాన్ని తీసుకున్నారు. చాలా నిదానంగా .. నింపాదిగా ఈ ఎపిసోడ్ నడుస్తుంది. ఇక క్లైమాక్స్ లో ధనపిశాచిని కట్టడి చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా కాకుండా, ఏదో షూటింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ధనపిశాచితో ఫైట్ .. హిమశిఖరాలపై హీరో నృత్యం .. ఇలా కథ ఏటో .. ఎటెటో వెళ్లిపోతుంది. ఇంతా జరిగాక మళ్లీ మొదటికొచ్చాశాను అన్నట్టుగా, ధనపిశాచి నుంచి అదే అరుపు. పనితీరు: ఒక కథకు ఎక్కువ అంశాలను జోడిస్తున్నప్పుడు .. ఆ కథను అన్ని వైపుల నుంచి పెర్ఫెక్ట్ గా అల్లుకుంటూ రావలసి ఉంటుంది. అలాగే ఏ విషయాన్ని చెప్పడానికి ఎంత సమయం తీసుకోవాలనేది కూడా ముఖ్యమే. కథకి క్లైమాక్స్ అనేది ప్రాణం లాంటిది. ఆ క్లైమాక్స్ విషయంలో గందరగోళం లేకుండా చూసుకుంటే బాగుండేది. ఇక కథాకథనాల విషయం అలా ఉంచితే, ధన పిశాచి మొదలు .. హీరోయిన్ .. మాంత్రికుల హెయిర్ స్టైల్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సమీర్ కల్యాణి ఫొటోగ్రఫీ .. రాజీవ్ రాజ్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. శివుడి గురించి నీలకంఠశాస్త్రి చెప్పేటప్పుడు ఆ స్థాయికి తగిన సంభాషణలు పడలేదని అనిపిస్తుంది. ముగింపు: నిజానికి 'జటాధర' అనేది చాలా పవర్ఫుల్ టైటిల్. అలాగే నిధి .. ధన పిశాచి .. దైవశక్తి అనేవి కూడా ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించే అంశాలే. అయితే సరైన కసరత్తు లేని కారణంగా, ఆశించిన స్థాయి సన్నివేశాలు తెరపై ఆవిష్కృతం కాలేదు. అందువలన అనవసరమైన సన్నివేశాలు .. అక్కడక్కడా కాస్త గందరగోళం తప్పలేదు. Movie Details Movie Name: Jatadhara Release Date: 2025-11-07 Cast: Sudheer Babu,Sonakshi Sinha,Divya Khosla Kumar,Shilpa Shirodkar,Indira Krishnan Director: Venkat Kalyan - Abhishek Jaiswal Music: Rajeev Raj Banner: Zee Studios Ess Kay Gee Review By: Peddinti Jatadhara Rating: 2.25 out of 5

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :