Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Naga Chaitanya – Sai Pallavi : నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తండేల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గీత ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మాణంలో చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా భారీగా తెరకెక్కుతుంది. శ్రీకాకుళంలోని కొంతమంది మత్సకారుల నిజ జీవిత కథ నుంచి ఈ సినిమా రాసుకున్నారు. ఇప్పటికే తండేల్ నుంచి రిలీజయిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు నెలకొల్పింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమాలో శివరాత్రి సాంగ్ చిత్రీకరించారు. శ్రీకాకుళం దగ్గర్లోని శ్రీ ముఖలింగం శివుని ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా చేస్తారు. ఆ వేడుకల సీన్ సినిమాలో ఉండటంతో శివరాత్రి కోసం స్పెషల్ సాంగ్ చేసారు. దాదాపు 1000 మంది ఆర్టిస్టులు, డ్యాన్సర్లతో కలిపి ఈ సాంగ్ షూట్ చేసారు. తాజాగా షూటింగ్ నుంచి కొన్ని ఫోటోలు రిలీజ్ చేసారు మూవీ యూనిట్. ఈ ఫొటోల్లో నాగ చైతన్య, సాయి పల్లవి నృత్యం చేస్తున్నట్టు, వెనకాల డ్యాన్సర్లు, వెనకాల అర్థనారీశ్వర రూపంలో శివుడి విగ్రహం ఉండటంతో ఈ సాంగ్ ని భారీగా చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ఫొటోల్లో నాగచైతన్య, సాయి పల్లవిలను చూస్తుంటే శివపార్వతులు వచ్చి నాట్యం చేస్తున్నారేమో అన్నట్టు ఉంది అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
Admin
Studio18 News