Monday, 19 January 2026 08:44:03 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Prakash Raj: ఆ యాప్స్‌లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోతున్నారు... ఈ విషయంలో చేసిన తప్పుకు క్షమించండి: ప్రకాశ్ రాజ్

Date : 12 November 2025 07:40 PM Views : 196

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : బెట్టింగ్ యాప్‌ల కేసులో సిట్ ఎదుట విచారణకు హాజరైన ప్రకాశ్ రాజ్ 2016లో తాను ప్రమోట్ చేశానని, ఆ తర్వాత దానిని రద్దు చేసుకున్నానని వెల్లడి తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పుతప్పే అన్న ప్రకాశ్ రాజ్ బెట్టింగ్ యాప్స్‌లు, గేమింగ్ యాప్స్‌లలో పెట్టుబడులు పెట్టి ఎంతోమంది యువత ఆర్థికంగా నష్టపోతున్నారని, దీనివల్ల వారి కుటుంబాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నటుడు ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల కేసులో సిట్ ఎదుట విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2016లో తాను ఒక యాప్‌న ప్రమోట్ చేశానని, అయితే ఆ యాప్ 2017లో బెట్టింగ్ యాప్‌గా రూపాంతరం చెందిందని ఆయన తెలిపారు. వెంటనే తాను ఆ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పేనని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఈ విషయంలో తాను క్షమాపణ కోరుతున్నానని ఆయన తెలిపారు. సిట్ అధికారులకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, డాక్యుమెంట్స్, బ్యాంకు లావాదేవీలను అందజేసినట్లు ఆయన వెల్లడించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ల కారణంగా ఎంతోమంది నష్టపోయి, వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కష్టపడితేనే ఫలితం ఉంటుందని, కష్టపడితేనే డబ్బులు వస్తాయని కాబట్టి అందరూ కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినందుకు తనను క్షమించాలని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని ఆయన అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :