Monday, 19 January 2026 08:08:10 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Chikiri Song | దూసుకుపోతున్న రామ్ చ‌ర‌ణ్ చికిరి పాట‌..బామ్మ స్టెప్స్‌కి ఫిదా కాకుండా ఉండ‌లేరు..!

Chikiri Song | మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్

Date : 02 December 2025 07:26 PM Views : 210

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Chikiri Song | మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, అలాగే ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ‘చికిరి… చికిరి…’ సాంగ్ సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేస్తుంది. ప్రత్యేకంగా ఈ పాటలో రామ్‌చరణ్ వేసిన ఎనర్జిటిక్‌ స్టెప్పులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఫంక్షన్‌లో ఒక బామ్మ రామ్‌చరణ్ స్టెప్పులను అచ్చం ఆయనలా ప్రయత్నిస్తూ ‘చికిరి… చికిరి…’ పాటకు డాన్స్ చేసిన వీడియో నెట్టింట దుమారం రేపుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఆ బామ్మ చూపించిన ఎనర్జీ, చిరునవ్వు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫ్యాన్స్ స్పందిస్తూ.. “పాట హిట్ అయింద‌న‌డానికి ఇదే ఉదాహ‌ర‌ణ‌!”, “చరణ్ స్టెప్పులు వయసు తేడాను కూడా దాటేశాయి”, “బామ్మ క్యూట్‌నెస్‌కి సెల్యూట్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ‘పెద్ది’ సినిమాపై మరింత హైప్ పెరుగుతోంది. చిత్రం విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, పాటలు, లుక్స్, డాన్స్ నంబర్లతో రామ్‌చరణ్ సినిమా సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది. అభిమానులు మాత్రం థియేటర్‌లో చరణ్ ఎంట్రీ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. రంగ‌స్థలంని మించి పెద్దిలో రామ్ చ‌ర‌ణ్ మ్యాజిక్ చేస్తాడేమో అని ముచ్చ‌టించుకుంటున్నారు. రామ్ చరణ్ చేసిన చికిరి చికిరి స్టెప్స్‌ని ప్ర‌తి ఒక్క‌రు అనుసరిస్తూ తెగ రీల్స్ చేస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం, రామ్ చరణ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్ కలిసిరావ‌డంతో ఈ పాటకి విప‌రీత‌మైన క్రేజ్ పెరిగింది. యూట్యూబ్‌లో కూడా ఈ పాట వ్యూస్ వేగంగా పెరుగుతూ 100 మిలియన్ మార్క్(10 కోట్ల‌) ను దాటింది . ఈ రికార్డ్ ప‌ట్ల మెగా ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలోనే కాదు… ఉత్తర భారతదేశం, విదేశాల్లో ఉన్న సినీ అభిమానులు కూడా ఈ పాటకు ఫిదా అవుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :