Saturday, 07 March 2026 08:07:22 PM
# డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం # మందమర్రి CER క్లబ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # గజ్వేల్ ఎంఆర్ఓ ఇంటిపై ఏసీబీ దాడులు

Deepika Padukone: బాలీవుడ్ అగ్ర తారల మధ్య మరోసారి రాజుకున్న ఫ్యాన్ వార్

Date : 06 September 2025 08:36 PM Views : 264

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : లీవైస్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా అలియా భట్ నియామకం ఇప్పటివరకు ఆ స్థానంలో కొనసాగిన దీపికా పదుకొణె దీపికను తప్పించడంపై అభిమానుల తీవ్ర అసంతృప్తి బాలీవుడ్ అగ్ర కథానాయికలు దీపికా పదుకొణె, అలియా భట్ మధ్య వృత్తిపరమైన పోటీ గురించి అందరికీ తెలిసిందే. అయితే, తామిద్దరం మంచి స్నేహితులమని వారు చెబుతున్నప్పటికీ, వారి అభిమానుల మధ్య మాత్రం తరచూ సోషల్ మీడియాలో వార్ నడుస్తూనే ఉంటుంది. తాజాగా ఓ ప్రముఖ బ్రాండ్ విషయంలో ఈ ఫ్యాన్ వార్ మరోసారి భగ్గుమంది. వివరాల్లోకి వెళితే.. ప్రఖ్యాత అమెరికన్ దుస్తుల బ్రాండ్ 'లీవైస్'కు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఇప్పటివరకు దీపికా పదుకొణె వ్యవహరించారు. అయితే, నిన్న ఆ సంస్థ అనూహ్యంగా దీపిక స్థానంలో అలియా భట్‌ను తమ కొత్త గ్లోబల్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన క్షణం నుంచి దీపిక అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటిని ఎందుకు తొలగించారంటూ లీవైస్ బ్రాండ్‌ను, ఆ స్థానంలోకి వచ్చిన అలియా భట్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ మార్పుపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. "మాకు దీపికనే తిరిగి కావాలి, ఆమె స్థానంలో అలియా ఎందుకు?" అని ఒకరు కామెంట్ చేయగా, "లీవైస్ డెనిమ్‌లో దీపిక కనిపించినంత అందంగా మరెవరూ కనిపించరు" అని మరో యూజర్ అభిప్రాయపడ్డారు. మరికొందరు అభిమానులు ఇంకాస్త ఘాటుగా స్పందిస్తూ అలియాపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. "అలియాకు దీపికను చూస్తే అసూయ, అభద్రతాభావం ఎక్కువ. అందుకే దీపిక నుంచి ప్రతీ అవకాశాన్ని లాగేసుకుంటోంది. అన్ని బ్రాండ్లు తనకే కావాలనే ఆశ ఆమెలో కనిపిస్తోంది" అంటూ కొందరు నెటిజన్లు ఆరోపించారు. ఈ కొత్త పరిణామంతో ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య ఉన్న పోటీ అభిమానుల పుణ్యమా అని మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :