Sunday, 08 March 2026 04:20:01 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

'క‌న్న‌ప్ప' నుంచి శ్రీ కాళహస్తి లిరికల్ వీడియో సాంగ్ ప్రోమో విడుద‌ల‌

Date : 27 May 2025 04:41 PM Views : 595

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో బాలీవుడ్ డైరెక్ట‌ర్ ముఖేశ్‌ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం 'క‌న్న‌ప్ప'. ఈ సినిమా జూన్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన మూవీ టీజ‌ర్లు, ట్రైల‌ర్‌, పోస్ట‌ర్లు, పాట‌లు క‌న్న‌ప్పపై భారీ అంచ‌నాలు నెల‌కొల్పాయి. ఇక‌, ఈ మూవీ ద్వారా మోహ‌న్ బాబు మ‌న‌వ‌రాళ్లు, విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా కూడా తెరంగేట్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే వారి తాలూకు పోస్ట‌ర్ల‌ను చిత్రం యూనిట్ విడుద‌ల చేసింది. ఇక‌, ఈ ఇద్ద‌రు సిస్ట‌ర్ల గురించి ఇటీవ‌ల మోహ‌న్ బాబు ఆస‌క్తిక‌ర అప్‌డేట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో భాగంగా ఈ సోద‌రిమ‌ణులు శ్రీ కాళహస్తి స్థలపురాణాన్ని వివరించే లిరికల్ వీడియోను మే 28న విడుదల చేస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఇందులో భాగంగా తాజాగా శ్రీ కాళహస్తి లిరికల్ వీడియో సాంగ్ ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ, మ‌ల‌యాళం భాష‌ల్లో రేపు (బుధ‌వారం) ఈ పాట విడుద‌ల కానుంది. కాగా, ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్ర‌లో కనిపించనున్న సంగ‌తి తెలిసిందే. అలాగే మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ త‌దిత‌రులు ఇత‌ర‌ కీలక పాత్రలు పోషించారు. https://youtu.be/oR_gMagRLM8

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :