Saturday, 24 January 2026 08:33:50 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Shilpa Shetty: శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాపై లుకౌట్ నోటీసు

Date : 05 September 2025 06:28 PM Views : 374

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : రూ.60 కోట్ల మోసం కేసులో ముంబై పోలీసుల చర్యలు వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఫిర్యాదుతో కేసు నమోదు వ్యాపారం పేరుతో డబ్బు తీసుకుని మోసం చేశారని ఆరోపణ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కోట్ల రూపాయల మోసం ఆరోపణలకు సంబంధించిన కేసులో ముంబై పోలీసులు వారిద్దరిపై లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. వ్యాపారం కోసం తీసుకున్న డబ్బును పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) దర్యాప్తును వేగవంతం చేసింది. అసలేం జరిగింది? ‘బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే తమ సంస్థ విస్తరణ పేరుతో శిల్పా దంపతులు తన వద్ద నుంచి సుమారు రూ.60 కోట్లు తీసుకున్నారని దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2015 నుంచి 2023 మధ్య కాలంలో ఈ డబ్బును తీసుకున్నారని, దానిని వ్యాపారానికి కాకుండా వ్యక్తిగత ఖర్చులకు వాడుకున్నారని ఆయన ఆరోపించారు. తీసుకున్న డబ్బును అప్పుగా చూపి, పన్ను ఆదా కోసం దానిని పెట్టుబడిగా మార్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను పెట్టిన పెట్టుబడికి ఏటా 12% వడ్డీతో పాటు అసలు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారని కొఠారి తెలిపారు. దీనికి సంబంధించి 2016 ఏప్రిల్‌లో శిల్పా శెట్టి స్వయంగా తనకు లిఖితపూర్వకంగా వ్యక్తిగత హామీ ఇచ్చారని ఆయన వివరించారు. అయితే, ఆ హామీ ఇచ్చిన కొద్ది నెలలకే శిల్పా శెట్టి కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని తెలిపారు. అంతేకాకుండా, ఆ సంస్థపై అప్పటికే రూ.1.28 కోట్ల దివాలా కేసు నడుస్తోందన్న విషయాన్ని కూడా తన వద్ద దాచిపెట్టారని ఆయన ఆరోపించారు. కొఠారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ఈఓడబ్ల్యూ అధికారులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాల ప్రయాణ వివరాలను పరిశీలిస్తున్నారు. సంస్థ ఆడిటర్‌ను కూడా విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలను శిల్పా, రాజ్ కుంద్రా దంపతులు ఖండించారు. తమ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే ఈ నిరాధారమైన, దురుద్దేశపూర్వక కేసు పెట్టారని వారు పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :