Wednesday, 17 December 2025 02:24:25 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

అడుగుకో ట్విస్ట్ .. ఓటీటీలో తమిళ హిట్ మూవీ!

తమిళంలో రూపొందిన 'సట్టం ఎన్ కైయిల్' క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ సెప్టెంబర్లో థియేటర్లకు వచ్చిన సినిమా ఈ నెల 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ ఆసక్తిన

Date : 11 November 2024 02:48 PM Views : 267

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తమిళంలో ఈ మధ్య కాలంలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలలో 'సట్టం ఎన్ కైయిల్' ఒకటి. సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. సతీశ్ .. అజయ్ రాజ్ .. పావెల్ నవగీతన్ .. విద్యా ప్రదీప్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి 'చాచి' దర్శకత్వం వహించాడు. థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా, ఈ నెల 8వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా .. చాలా సహజంగా మొదలవుతుంది. గౌతమ్ అనే క్యాబ్ డ్రైవర్ ఓ రాత్రివేళ తన కారులో ప్రయాణిస్తూ, బైక్ పై ఎదురుగా వచ్చిన వ్యక్తిని ఢీ కొడతాడు. హెల్మెట్ ధరించడం వలన ఆ వ్యక్తి ఫేస్ కనిపించదు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని తన కారు డిక్కీలో పడుకోబెట్టి, ఓ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులకు దొరికిపోతాడు. తన కారు డిక్కీని పోలీసులు చూడకుండా వారితో గొడవపడి స్టేషన్ కి వెళతాడు. ఆ సమయంలో ఓ యువతీ డెడ్ బాడీ ఫలానా ప్రాంతంలో దొరికినట్టుగా పోలీసులకు కాల్ వస్తుంది. ఆ యువతి పేరు నివేత అని పోలీసులు తెలుసుకుంటారు. నివేత ఎవరు? ఆమెను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? నివేత చనిపోవడానికీ .. గౌతమ్ కి ఏమైనా సంబంధం ఉంటుందా? గౌతమ్ కారు డిక్కీలో ఉన్నది ఎవరు? అనే మలుపులతో ఈ కథ ఉత్కంఠను రేకెత్తిస్తుంది. త్వరలోనే తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం... మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :