Sunday, 25 January 2026 04:48:54 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Pragati Yadav: పెళ్లయిన రెండు వారాలకే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య

ఉత్తరప్రదేశ్‌లోని ఔరియా జిల్లాలో ఘటన నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న జంట వారి ప్రేమను నిరాకరించి యువతికి బలవంతంగా పెళ్లి చేసిన తల్లిదండ్రులు నిందితుల అ

Date : 25 March 2025 11:21 AM Views : 355

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : పెళ్లయిన రెండు వారాలకే భర్తను అంతమొందించేందుకు ప్రియుడితో కలిసి కుట్ర పన్నిందో భార్య. ఉత్తరప్రదేశ్‌లోని ఔరియా జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. పోలీసుల కథనం ప్రకారం.. నిందితులు ప్రగతి యాదవ్(22), అనురాగ్ యాదవ్ ఇద్దరూ నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే, వీరి పెళ్లికి ప్రగతి తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5న దిలీప్‌తో ప్రగతికి బలవంతంగా వివాహం జరిపించారు. ఈ నెల 9న దిలీప్ బుల్లెట్ గాయాలతో ఓ పొలంలో పడి ఉండగా పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మరో మూడు ఆసుపత్రులకు తరలించారు. చివరికి ఔరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 20న మృతి చెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. బాధితుడి భార్య, ఆమె ప్రియుడు కలిసి దిలీప్ హత్యకు కుట్ర పన్నిన విషయం వెలుగులోకి వచ్చింది. వివాహం తర్వాత ఇద్దరూ కలుసుకునేందుకు వీలు లేకపోవడంతో దిలీప్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కాంట్రాక్ట్ కిల్లర్ రామాజీ చౌదరీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం రూ. 2 లక్షలు చెల్లించారు. రామాజీ మరికొందరితో కలిసి బైక్‌పై దిలీప్‌ను పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ దిలీప్‌పై దాడి చేశారు. ఆ తర్వాత తుపాకితో కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వారి నుంచి రెండు తుపాకులు, నాలుగు లైవ్ కాట్రిడ్జ్‌లు, ఒక బైక్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక పర్స్, ఆధార్‌కార్డు, రూ. 3 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :