Tuesday, 18 November 2025 04:26:11 PM
# Ashes Series | కమిన్స్ ఫిట్‌.. యాషెస్‌ తొలి టెస్టులో ఆడేనా..! # Tollywood | ‘ఐబొమ్మ’ పైరసీ వెబ్‌సైట్ క్లోజ్.. సజ్జ‌నార్‌ని క‌లిసిన టాలీవుడ్ ప్ర‌ముఖులు # United Airlines: భార్య లగేజీలో బాంబు... భర్త బెదిరింపుతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ # Rasha Thadani | ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. జోడీగా ఎవ‌రు అంటే..! # Nagarjuna | శివ వైబ్స్‌ రీక్రియేట్‌ చేస్తున్న నాగార్జున.. ఇంతకీ ఏం ప్లాన్ చేస్తున్నాడేంటి..? # 'భగవత్ చాప్టర్ 1: రాక్షస్' (జీ 5)మూవీ రివ్యూ! # allu arjun | అల్లు అర్జున్‌ ఫోన్‌ వాల్‌పేపర్‌ గమనించారా..? ఆ రూల్‌నే ఫాలో అవుతామంటున్న ఫ్యాన్స్‌ # Chiru – Bobby | చిరు-బాబీ మూవీపై క్రేజీ అప్‌డేట్‌.. షూటింగ్ ఎప్పుడంటే..! # Akhanda 2 | భీమ్లానాయక్‌ భామతో బాలకృష్ణ స్టెప్పులు.. అఖండ 2 నుంచి జాజికాయ సాంగ్‌ ఆన్‌ ది వే # Heeramandi 2 | ‘హీరామండి 2’లో త‌మ‌న్నా – కాజ‌ల్ అగ‌ర్వాల్ .. భ‌న్సాలీ సీక్వెల్ పై భారీ చర్చ! # Saudi bus accident: సౌదీ ప్రమాదం: మృతుల్లో మల్లేపల్లి బజార్ ఘాట్ వాసులు 18 మంది # Shivaji | చాలా మందికి ఉపయోగపడుతున్నాననుకున్నాడు కానీ.. ఐబొమ్మ రవిపై యాక్టర్ శివాజీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ # Kumar Sangakkara: సంగక్కర మళ్లీ హెడ్ కోచ్.. జడేజా, శామ్ కరన్‌తో రాజస్థాన్ కొత్త లుక్ # అదే జరిగితే.. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు.. సీపీఐ రామకృష్ణ ఆగ్రహం # Chiranjeevi: వేలమంది కష్టాన్ని ఒక్కడే దోచేశాడు: ఐబొమ్మ నిర్వాహకుడిపై చిరంజీవి ఆగ్రహం # TTD | రేపు ఫిబ్రవరి కోటా శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల విడుదల # Tirumala | తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే ? # Dhruv Vikram: ఓటీటీకి తమిళ హిట్ మూవీ! # Pawan Kalyan | హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌, పోలీసులకు పవన్‌కల్యాణ్‌ అభినందనలు # Balakrishna: బాలయ్య జోలికి వస్తే చర్మం ఒలిచేస్తా: వైసీపీకి ఎమ్మెల్యే మాస్‌ వార్నింగ్

సినీ పరిశ్రమను దెబ్బతీస్తున్న భారీ బడ్జెట్ సినిమాలు, హీరోల రెమ్యునరేషన్లు..! వారు మారాల్సిన సమయం వచ్చేసిందా?

Date : 28 September 2024 10:26 AM Views : 167

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Film Industry Crisis : హీరోల తాలూకు ఇమేజ్, దర్శకుల తాలూకు అర్థంలేనితనం, ప్రేక్షకుల తాలూకు అర్థం చేసుకోలేనితనం.. వీటన్నింటి మధ్యలో ఓ మంచి సినిమా రావడం అంటే మామూలు విషయం కాదు. ఇన్ని ఇబ్బందుల మధ్య హీరోల రెమ్యునరేషన్లు సినిమాను మరింత భారంగా మారుస్తున్నాయి. ఇండస్ట్రీని పక్కదారి పట్టిస్తున్నాయి. భారీ బడ్జెట్ మూవీస్ పరిశ్రమ కొంప ముంచేలా కనిపిస్తున్నాయి. అసలు ఎందుకీ పరిస్థితి? కరణ్ చెప్పినట్లు, గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు.. మార్పు మొదలు కావాల్సిందేనా? లేక సినీ పరిశ్రమ ఉనికే ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉందా? గట్టిగా లెక్కేసి చూస్తే పెద్ద హీరో సినిమా వచ్చి ఎన్నాళ్లైంది. రాబోయేది ఎన్నాళ్లకు వస్తుంది? పెరుగుతున్న బడ్జెట్ లు, పెంచుకున్న రెమ్యునరేషన్లు.. సినిమాను మరింత భారంగా మారుస్తున్నాయి. నిర్మాతకు తడిసి మోపెడు అయ్యేలా చేస్తున్నాయి. ఇంత ఖర్చు పెట్టాము కదా.. కలెక్షన్లు ఆ లెవెల్ లోనే ఉంటాయా అంటే.. అది నిర్మాత అదృష్టమే మరి. పదుల, 100 కోట్లకు పెరిగిన హీరోల రెమ్యునరేషన్లు.. ఇప్పుడు ఇండస్ట్రీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్న పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీని దెబ్బతీస్తున్నాయి. హీరోల తాలూకు ఇమేజ్ పేరుతో వందల కోట్లకు తోడు డైరెక్టర్ల తాలూకు అర్థంలేని తనం సినిమాను మరింత భారంగా మారుస్తోంది. భారీ అంటూ సినిమాను భారంగా మార్చేసి ఇండస్ట్రీని దెబ్బతీస్తున్న సీన్ కనిపిస్తోంది. అంత ఖర్చు పెట్టి ధీమాగా ఉండొచ్చా అంటే.. హిట్ సినిమాకు స్టార్లు గ్యారెంటీ కాదు అంటూ సైఫ్ అలీఖాన్ లా ఈజీగా ఓ మాట అనేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. పాన్ ఇండియా పోటీలో పడి కథను పక్కన పెడుతున్నారు. పారితోషికాలు పెంచేసి ఆ భారాన్ని జనాల మీదకు తోసేస్తున్నారు. ఈ ప్రభావం అంతా ఇండస్ట్రీ మీద పడేలా కనిపిస్తోంది. రెమ్యునరేషన్ల వ్యవహారం ఇండస్ట్రీని ముంచేసే పరిస్థితి కనిపిస్తోంది. హీరోలు, డైరెక్టర్లు ఇప్పటికైనా మారాలా? ఇండస్ట్రీలో ఈ పరిస్థితికి కారణమేంటి? రెమ్యేనరేషన్లు ఇండస్ట్రీని ఎలా దెబ్బతీస్తున్నాయి? రెమ్యునరేషన్ విషయంలో తగ్గితే తప్పేంటి? హీరోల రెమ్యునరేషన్లు, నిర్మాతల ఇబ్బందులపై తమిళ డైరెక్టర్ వెట్రామారన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తున్నాయి. హీరోల రెమ్యునరేషన్లు, సినిమా బడ్జెట్ పెరగటంలో ఓటీటీలు ప్రధానంగా కారణం అవుతున్నాయని క్లియర్ కట్ గా చెప్పేశాడు. ఏ దర్శకుడు అయినా థియేటర్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా తెరకెక్కించాలని, మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లకు వచ్చి చూస్తారని చెప్పుకొచ్చాడు వెట్రి. కొందరు డైరెక్టర్లపై ఇండైరెక్ట్ గా సెటైర్లు వేశాడు. హీరో ఇమేజ్ అడ్డం పెట్టుకుని ఏళ్లకు ఏళ్లు సినిమాను సాగదీస్తూ ఎలివేషన్లు మాత్రమే చూపిస్తే ప్రతీసారి వర్కౌట్ కాదు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :