Sunday, 25 January 2026 04:49:31 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Tollywood: ఇదేం ట్విస్ట్! సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న క్రేజీ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. షాక్‌లో ఫ్యాన్స్

బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ ప్రముఖ హీరోయిన్ పెళ్లిపీటలెక్కింది. అది కూడా రహస్యంగా.. వివాహ వేడుక అనంతరం తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింద

Date : 09 September 2025 08:42 PM Views : 337

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ‘ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి .. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి’.. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పెళ్లి వేడుక గురించి వెంకటేష్ చెప్పిన మాటలివి. ఈ మాటలను నిజం చేస్తూ చాలా మంది ఎంతో ఆర్భాటంగా తమ పెళ్లిళ్లు చేసుకుంటారు. డబ్బును మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తూ ఐదు రోజుల పెళ్లి, పది రోజుల పెళ్లి అంటూ అంటూ నానా హంగామా చేస్తున్నారు. ఇక విందులు, వినోదాలకు కూడా భారీగా డబ్బు వెచ్చిస్తుంటారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీల పెళ్లిళ్ల విషయంలో ఈ హంగులు, ఆర్భాటం ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఒక ప్రముఖ హీరోయిన్ ఇవేవీ లేకుండానే సింపుల్ గా పెళ్లి చేసుకుంది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సీక్రెట్ గా పెళ్లిపీటలెక్కి అందరికీ షాక్ ఇచ్చింది. వివాహ వేడుక అనంతరం సోషల్ మీడియాలో స్వయంగా తనే పెళ్లి ఫొటోస్ షేర్ చేసింది. ఇందులోనూ ఎంతో గోప్యత పాటించిందీ అందాల తార. కనీసం భర్త ఎవరన్నది తెలియకుండా ఇద్దరి ముఖాలు కూడా కనిపించకుండా తీసుకున్న ఫొటోలను మాత్రమే సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ షేర్ చేసిన పెళ్లి ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన వాళ్లందరూ షాక్ అవుతున్నారు. అదే సమయంలో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇలా సీక్రెట్ పెళ్లితో వార్తల్లో నిలిచిన ఈ హీరోయిన్ మరెవరో కాదు మలయాళ బ్యూటీ గ్రేస్ ఆంటోని. తెలుగు ఆడియెన్స్ కు ఈ అందాల తార పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ ఓటీటీలో మలయాళ సినిమాలు చూసే వారికి ఈ బ్యూటీ చాలా పరిచయం. కుంబళంగి నైట్స్, నునక్కుళి, పరంతు పో, రోర్చా తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :