Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Bigg Boss Nominations : బిగ్ బాస్ రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారం సాగుతుంది. సోమ, మంగళ వారాల్లో మూడో వారం నామినేషన్స్ తోనే సాగింది బిగ్ బాస్. అయితే ఈ వారం కంటెస్టెంట్స్ ఎవరినైతే నామినేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్లపై చెత్త వేసి నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. దీని కోసం సపరేట్ గా ఎండిపోయిన ఆకులతో చెత్త, పాత చెత్త బుట్టలు తయారుచేసి మరీ పెట్టాడు బిగ్ బాస్. ఇక నామినేషన్స్ లో ఒకరిపై ఒకరు ఫైర్ అవ్వడం మాములే. నామినేట్ చేసే కంటెస్టెంట్స్, చేయించుకున్న కంటెస్టెంట్స్ అంతా ఒకరిపై ఒకరి అరుచుకున్నారు. ఇక మూడో వారం నామినేషన్స్ లో ప్రేరణ, పృథ్వి, మణికంఠ, విష్ణుప్రియ, సీత, నైనిక, యష్మి, అభయ్ లు ఉన్నారు. అయితే అభయ్, నిఖిల్ కి సొంత నామినేషన్ ఆఫర్ ఇస్తే అభయ్ కాన్ఫిడెన్స్ తో నేను సేఫ్ అవుతాను అంటూ సొంతంగా నామినేట్ అయ్యాడు. మొదటివారం బేబక్క, రెండో వారం శేఖర్ బాషా ఎలిమినేటి అవ్వగా మరి మూడో వారం ఏ కంటెస్టెంట్ ఎలిమినేటి అవుతారో చూడాలి.
Admin
Studio18 News