Monday, 19 January 2026 08:22:25 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Shobhita Dhulipala: వివాదాస్పద సినిమాపై అక్కినేని కోడలు శోభిత ప్రశంసలు.. అమ్మాయిలు చూడాలంటూ సూచన

Date : 12 November 2025 07:04 PM Views : 141

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఓటీటీలోకి వచ్చిన 'బ్యాడ్ గర్ల్ వెట్రిమారన్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ గతంలో సెన్సార్ వివాదాలతో వార్తల్లో నిలిచిన సినిమా ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'బ్యాడ్ గర్ల్' శోభిత పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య భార్య, నటి శోభిత ధూళిపాళ ఇటీవల ఓటీటీలో విడుదలైన ఓ వివాదాస్పద తమిళ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూసి తాను ఎంతో చలించిపోయానని, ముఖ్యంగా అమ్మాయిలందరూ తప్పకుండా చూడాలని కోరుతూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ నిర్మాణంలో 'బ్యాడ్ గర్ల్' అనే చిత్రం తెరకెక్కింది. వర్ష భరత్ కుమార్ ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమయ్యారు. సామాజిక కట్టుబాట్ల మధ్య స్వేచ్ఛగా జీవించాలని ఆరాటపడే ఓ మధ్యతరగతి యువతి కథగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే, టీజర్ విడుదల సమయంలో బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సెన్సార్ బోర్డు సినిమా విడుదలను నిలిపివేయడంతో ఇది వివాదాస్పదంగా మారింది. అనేక అడ్డంకులను దాటుకుని సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను వీక్షించిన శోభిత ధూళిపాళ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ, "బ్యాడ్ గర్ల్.. నన్ను నవ్వించింది.. ఏడిపించింది. మంచి సినిమా చూసిన అనుభూతి కలిగించింది. అందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది. ముఖ్యంగా అమ్మాయిలకు దీన్ని చూడమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మనకోసం తీసిన చిత్రం. వర్ష భరత్, అంజలి శివరామన్‌ను అభినందించాలి" అని రాసుకొచ్చారు. శోభిత పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తూ సినిమాపై ఆసక్తి చూపిస్తుండగా, మరికొందరు మాత్రం ఇటీవల వచ్చిన 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా గురించి ఎందుకు స్పందించ లేదంటూ ప్రశ్నిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :