Sunday, 25 January 2026 04:38:42 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

కమల్ హాసన్ వ్యాఖ్యలు.. చప్పట్లు కొట్టారనడంపై శివరాజ్ కుమార్ స్పందన

Date : 02 June 2025 03:24 PM Views : 328

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : 'థగ్ లైఫ్' సినిమాకు సంబంధించి ఇటీవల జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందన్న అర్థం వచ్చేలా కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల పట్ల కన్నడ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో, కమల్ ఆ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ చప్పట్లు కొట్టారని కొన్ని ప్రసార మాధ్యమాల్లో కథనాలు వచ్చాయి. ఈ ప్రచారంపై శివరాజ్ కుమార్ స్పందించారు. తాను ఆ సమయంలో చప్పట్లు కొట్టలేదని స్పష్టం చేశారు. వివరణ ఇచ్చిన శివరాజ్ కుమార్ 'థగ్ లైఫ్' కార్యక్రమానికి సంబంధించిన వీడియోలలో, కమల్ హాసన్ కన్నడ భాష గురించి మాట్లాడుతున్నప్పుడు శివరాజ్ కుమార్ చప్పట్లు కొడుతున్నట్లు కనిపించింది. దీంతో ఆయన కమల్ వ్యాఖ్యలను సమర్థించారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై శివరాజ్ కుమార్ మాట్లాడుతూ, "అన్ని భాషలు ముఖ్యమైనవే. కానీ, నా మాతృభాష అయిన కన్నడకే నేను ఎప్పుడూ మొదటి ప్రాధాన్యం ఇస్తాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో కూడా ఇదే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాను. కన్నడ కోసం నా ప్రాణమైనా ఇస్తాను" అని పేర్కొన్నారు. చప్పట్ల వివాదంపై ఆయన స్పందిస్తూ, "ఆ కార్యక్రమంలో అసలేం జరిగిందో నాకు పూర్తిగా అర్థం కాలేదు. కమల్ హాసన్ ఆ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో నేను చప్పట్లు కొడుతున్నట్లు చూపించారు. కానీ, నేను ఆ సమయంలో చప్పట్లు కొట్టలేదు. వేరే ప్రసంగం సమయంలో కొట్టిన చప్పట్లను, ఎడిటింగ్‌లో ఈ వ్యాఖ్యలకు జోడించి చూపించారు" అని తెలిపారు. కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలా వద్దా అనే విషయంపై తాను వ్యాఖ్యానించలేనని, ఆయన చాలా సీనియర్ నటుడని, తాను ఆయనకు పెద్ద అభిమానినని శివరాజ్ కుమార్ పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :