Thursday, 12 March 2026 01:30:54 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Sameera Sharif | న‌న్నుటెర్ర‌స్‌పైకి తీసుకెళ్లి అలా చేశాడు … చేదు అనుభవాన్ని బయటపెట్టిన నటి

Sameera Sharif | ఇటీవల కాలంలో సమాజాన్ని కుదిపేస్తున్న అంశాల్లో ఒకటి మహిళలు, బాలికలు, చిన్న పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు. ఇటువంటి ఘటనలను అరికట్టేందు

Date : 09 January 2026 07:44 PM Views : 175

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Sameera Sharif | ఇటీవల కాలంలో సమాజాన్ని కుదిపేస్తున్న అంశాల్లో ఒకటి మహిళలు, బాలికలు, చిన్న పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు. ఇటువంటి ఘటనలను అరికట్టేందుకు పోక్సో వంటి కఠిన చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, అసలు సమస్యను రూట్‌లోనే అడ్డుకోవాలంటే చిన్న వయసులోనే పిల్లలకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీరియల్ నటి సమీరా షరీఫ్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి చిన్నతనంలోనే పిల్లలకు వివరంగా చెప్పాలని ఆమె సూచించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమీరా షరీఫ్, ఈ అంశంపై మాట్లాడుతూ తన చిన్ననాటి జీవితంలో ఎదుర్కొన్న బాధాకర అనుభవాన్ని తొలిసారి బహిర్గతం చేశారు. చిన్నప్పుడు తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకుంటూ, అప్పట్లో వాటి అర్థం కూడా తనకు తెలియలేదని ఆమె భావోద్వేగంగా వెల్లడించారు. సమీరా మాట్లాడుతూ… నా చిన్నతనంలో మేము రైల్వే క్వార్టర్స్‌లో ఉండేవాళ్లం. మా ఎదురింట్లో ఉన్న ఆంటీ ఇంటికి బంధువులు వచ్చేవారు. వారిలో ఒక అంకుల్ నన్ను బుగ్గలు గిల్లడం, ముద్దు చేయడం చేసేవారు. అప్పట్లో అది ఏంటో నాకు అర్థం కాలేదు. చిన్నపిల్లలం కదా… పెద్దవాళ్లు అలా చేస్తే సాధారణమే అనుకునేదాన్ని అని చెప్పారు. అంతేకాదు, దాగుడుమూతల ఆటలో భాగంగా జరిగిన మరో సంఘటనను కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. మేమంతా కలిసి దాగుడుమూతలు ఆడేవాళ్లం. ఆ అంకుల్ కూడా ఆ ఆటలో జాయిన్ అయ్యేవారు. దాక్కోవడానికి మేము టెర్రస్‌కి వెళ్లేవాళ్లం. అక్కడ ఎవరూ రారు కాబట్టి, నన్ను అక్కడికి తీసుకెళ్లి ముద్దు చేసేవారు. అది నాకు ఇబ్బందిగా అనిపించినా, చిన్నతనం వల్ల తను నన్ను ప్రేమగా అలా చేస్తున్నాడేమో అనుకునేదాన్ని. కానీ పెద్దయ్యాక అర్థమైంది… అతను తన కోరికలు తీర్చుకునేవాడని అని సమీరా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అనుభవం ఆధారంగా ఆమె.. తల్లిదండ్రులకు, పెద్దలకు కీలక సూచన చేశారు. పిల్లలకు చిన్న వయసులోనే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరంగా చెప్పాలి. ఎవరు ఎలా ప్రవర్తించినా అది తప్పు అని గుర్తించే శక్తి వాళ్లకు రావాలి. ఏదైనా ఇబ్బంది ఎదురైతే భయపడకుండా చెప్పుకునేలా ధైర్యం ఇవ్వాలి. ‘నువ్వు చెప్పితే మేమున్నాం, నీకు సపోర్ట్ చేస్తాం’ అనే భరోసా పిల్లలకు చాలా అవసరం” అని స్పష్టంగా చెప్పారు. సమీరా షరీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. చాలా మంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ, ఇలాంటి విషయాలపై ఓపెన్‌గా మాట్లాడటం వల్లే సమాజంలో మార్పు వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో, తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని, పిల్లలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :