Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రేమకథలు ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథలు మరింత అందంగా కనిపిస్తూ ఉంటాయి .. హృదయాలను బలంగా పట్టుకుంటూ ఉంటాయి. అలాంటి ఒక ప్రేమకథతో రూపొందిన సినిమానే 'ఐ హేట్ లవ్'.'నేనూ ప్రేమలో పడ్డాను' అనేది ట్యాగ్ లైన్. ప్రశాంత్ కార్తీ - విస్మయ శ్రీ .. ఆద్విక్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ ఏడాది ఆరంభంలో థియేటర్లకు వచ్చింది. చాలా గ్యాప్ తరువాతనే ఈ సినిమా ఈటీవీ విన్ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తోంది. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ సినిమను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. కథ విషయానికి వస్తే .. అది ఒక మారుమూల గ్రామం. ఆ విలేజ్ కి చెందిన యువకుడే రాంబాబు. ప్రేమపై పెద్దగా నమ్మకం లేని కుర్రాడు. అందువలన ఆడపిల్లలకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ ఉంటాడు. అలాంటి రాంబాబు ఒక బలహీనమైన క్షణంలో సీత ప్రేమలో పడిపోతాడు. అప్పటి నుంచి అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ. ఇక ఇదే రోజు నుంచి ఈటీవీ విన్ లో 'రేపటి వెలుగు' సినిమా కూడా స్ట్రీమింగ్ కానుంది.
Also Read : సౌదీలో అష్టకష్టాలు పడుతున్నాను... కాపాడండి!: మంత్రి లోకేశ్ కు కడప మహిళ కన్నీటి వేడుకోలు
Admin
Studio18 News