Monday, 19 January 2026 07:17:40 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Lungi Mama: నేను చదువుకోలేదు .. డాన్స్ మాత్రమే తెలుసు: లుంగీ మామ!

Date : 01 November 2025 07:26 PM Views : 261

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : వెంకట రమణకి 'లుంగీమామ'గా పేరు నెల్లూరు దగ్గర పల్లెటూరని వెల్లడి చేపల వేట మాత్రమే తెలుసని వివరణ తన టాలెంట్ కి బాబాయ్ కారకుడని వ్యాఖ్య యూ ట్యూబ్ ను ఎక్కువగా చూసేవారికి 'లుంగీ మామ' గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. లుంగీ పైకి కట్టి .. చెప్పులతో .. రోడ్డు పక్కనే ఆయన వేసే స్టెప్స్ ను చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఆయన గురించి తెలుగుకోవాలనే ఆసక్తి కూడా చాలామందికి ఉండేది. అలాంటి ఆయన హఠాత్తుగా మొన్న వచ్చిన 'కె ర్యాంప్' సినిమాలో, కిరణ్ అబ్బవరంతో కలిసి స్టెప్పులు వేశాడు. అలాంటి లుంగీమామ తాజాగా సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. " నా అసలు పేరు వెంకట రమణ. మాది నెల్లూరు జిల్లా లోని ఒక మారుమూల గ్రామం. నేను స్కూలుకి వెళ్లింది లేదు .. చదువుకున్నదీ లేదు. మాది మత్స్య కారుల కుటుంబం. అందరం సముద్రంపై ఆధారపడేవాళ్లమే. చిన్నప్పటి నుంచే మా బాబాయ్ తో కలిసి చేపల వేటకి వెళ్లేవాడిని. మా బాబాయ్ 'గోవింద్' కారణంగానే నాకు డాన్స్ పట్ల ఆసక్తి ఏర్పడింది. పాట వినిపిస్తే చాలు డాన్స్ చేస్తాడని మా ఊళ్లో చెప్పుకునేవారు" అని అన్నాడు. " మా ఊరికి చెందిన మున్నా - నరేందర్ కలిసి రీల్స్ చేసేవాళ్లు. ఒకరోజున వాళ్లు వచ్చి వీడియోస్ చేద్దామని అన్నారు. అలా చేసిన ఫస్టు సాంగ్ కి 4 మిలియన్స్ వ్యూస్ వచ్చింది. సాంగ్స్ దాదాపు నేనే సెలెక్ట్ చేస్తాను. ఎడిటింగ్ .. అప్ లోడ్ చేయడం అంతా కూడా మున్నా చూసుకుంటాడు. 'కె ర్యాంప్' సినిమా మాకు మరింత గుర్తింపు తెచ్చింది. ఆ పాటను మేమే కంపోజ్ చేసుకున్నాం. తెరపై కనిపించడం చాలా సంతోషంగా అనిపించింది" అని చెప్పాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :