Sunday, 15 March 2026 09:57:15 AM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

లోకనాయకుడు సహా నా పేరుకు ముందు బిరుదులన్నింటినీ తిరస్కరిస్తున్నాను: కమల్ హాసన్

భారతీయ సినీ రంగంలో కమల్ హాసన్ కు ప్రత్యేక అధ్యాయం లోకనాయకుడు సహా అనేక బిరుదులు కమల్ సొంతం తాను కళ కంటే ఎప్పుడూ గొప్పవాడ్ని కాదన్న కమల్ అందుకే ఇకపై తన

Date : 11 November 2024 03:14 PM Views : 323

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ కీలక ప్రకటన చేశారు. లోకనాయకుడు (ఉలగనాయగన్) సహా, తన పేరుకు ముందు వచ్చే అన్ని బిరుదులను తిరస్కరిస్తున్నట్టు నేడు వెల్లడించారు. ఈ మేరకు అభిమానులను ఉద్దేశించి సుదీర్ఘ లేఖ రాశారు. ఇక నుంచి తనను 'కమల్ హాసన్' అనే పేరుతో సంబోధిస్తే చాలని తెలిపారు. పేరుకు ముందు బిరుదులేవీ వద్దని సూచించారు. లోకనాయకుడు, ఇంకా ఇతర బిరుదులతో నన్ను పిలుచుకుంటూ, ఎంతో ప్రేమను ప్రదర్శించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, అయినప్పటికీ ఇకపై బిరుదులను తన పేరు ముందు చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నానని కమల్ హాసన్ స్పష్టం చేశారు. ఎందుకంటే, సినీ రంగంలో తనను తాను నిత్య విద్యార్థిగానే భావిస్తానని, ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటానని తన లేఖలో వినమ్రంగా పేర్కొన్నారు. సినిమా రంగం అనేది అందరికీ చెందుతుందని, లెక్కలేనంతమంది కళాకారుల సహకార ఫలితమే సినిమా రంగం అని వివరించారు. టెక్నీషియన్లు, ప్రేక్షకులు కూడా సినిమా రంగంలో భాగమేనని.... కళను మించి తాను గొప్పవాడ్నని కళాకారుడు ఎప్పుడూ అనుకోరాదని, అందుకే తాను ఎంత ఎదిగినా కళామతల్లి ముందు ఒదిగి ఉండాలని భావిస్తానని కమల్ వివరించారు. ఈ క్రమంలో, తాను గొప్పవాడ్ని అని భావించలేనని, అందుకే అన్ని బిరుదులను తిరస్కరిస్తున్నానని స్పష్టం చేశారు. ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న వారందరికీ మరొక్కమారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.

Also Read : మూసీ ప్రాంతంలో మైనార్టీల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేస్తోంది: కేటీఆర్

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :