Wednesday, 17 December 2025 03:45:47 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Bigg Boss 8 : బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీలు వీళ్ళే.. మొత్తం ఎనిమిది మంది.. అందరూ పాతోల్లే..

Date : 07 October 2024 11:09 AM Views : 167

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Bigg Boss 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయిదు వారాలు ముగిసింది. ఇప్పటికే ఆరుగురు ఎలిమినేట్ అవ్వగా కొత్తగా మళ్ళీ 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇచ్చారు. అయితే అందరూ పాతోల్లే కావడం గమనార్హం. వచ్చిన 8 మంది కూడా గత బిగ్ బాస్ సీజన్స్ లో పాల్గొన్నవాళ్ళే. వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్ళే.. హరితేజ : యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకున్న హరితేజ బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొని సెకండ్ రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత షోలు, సినిమాలతో బాగానే బిజీ అయింది. ఇటీవలే దేవర సినిమాలో కూడా అలరించింది. తన మూడేళ్ళ కూతురిని వదిలేసి ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీతో బిగ్ బాస్ లోకి రావడం గమనార్హం. టేస్టీ తేజ : ఫుడ్ వ్లాగ్స్ తో బాగా పాపులర్ అయిన టేస్టీ తేజ బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొన్నాడు. ఇప్పుడు మళ్ళీ సీజన్ 8లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. నయని పావని : షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ తెచ్చుకున్న ఈ భామ గత సీజన్ లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి ఒక్క వారానికే వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఎన్ని రోజులు హౌస్ లో ఉంటుందో చూడాలి. మెహబూబ్ : షార్ట్ ఫిలిమ్స్, డ్యాన్సులతో పాపులారిటీ తెచ్చుకున్న మెహబూబ్ బిగ్ బాస్ నాలుగో సీజన్ లో పార్టిసిపేట్ చేసాడు. ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చాడు. రోహిణి : సీరియల్స్, షోలు, సినిమాలతో లేడీ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకుంది రోహిణి. గతంలో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న రోహిణి ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చింది. గౌతమ్ కృష్ణ : నటుడిగా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ కృష్ణ గత సీజన్ లో పార్టిసిపేట్ చేసాడు. ఇప్పుడు మళ్ళీ ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చాడు. స్వతహాగా గౌతమ్ డాక్టర్ కావడం విశేషం. అవినాష్ : జబర్దస్త్ తో గుర్తింపు తెచ్చుకున్న అవినాష్ ఇప్పుడు షోలు, సినిమాలతో దూసుకుపోతున్నాడు. గతంలో బిగ్ బోస్ సీజన్ 4 లో పాల్గొన్న అవినాష్ మళ్ళీ ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. గంగవ్వ : యూట్యూబ్ లో వీడియోలతో మెప్పించిన గంగవ్వ బిగ్ బాస్ నాలుగో సీజన్ లో పాల్గొని ఆరోగ్య సమస్యలతో బయటకు వచ్చేసింది. ప్రస్తుతం సినిమాలు, యూట్యూబ్ వీడియోలతో బిజీగా ఉన్న గంగవ్వ ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ ఎనిమిది మందిలో ఎవరు ఫైనల్ దాకా ఆడతారు, ఎవరు మధ్యలో ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :