Monday, 19 January 2026 07:12:09 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

'కాంత' - మూవీ రివ్యూ!

Date : 14 November 2025 07:12 PM Views : 137

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : దుల్కర్ - భాగ్యశ్రీ జోడీగా 'కాంత' సినిమా నేపథ్యంలో సాగే కథ సాగతీత సన్నివేశాలు ఒకే సెట్లో సినిమాను పూర్తి చేసిన తీరు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోని కంటెంట్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా రూపొందిన సినిమానే 'కాంత'. సెల్వమణి సెల్వ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. మలయాళం వైపు నుంచి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన హీరో దుల్కర్ సల్మాన్. వరుస హిట్స్ తో ఉన్న దుల్కర్ నుంచి వచ్చిన సినిమా ఇది. ఇక సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే కి దుల్కర్ జోడీగా ఛాన్స్ తెచ్చిపెట్టిన సినిమా ఇది. అలాంటి ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. కథ: ఈ కథ 1950లలో .. మద్రాస్ నేపథ్యంలో నడుస్తుంది. సినిమా దర్శకుడిగా 'అయ్య' (సముద్రఖని)కి గతంలో మంచి పేరు ఉంటుంది. 12 ఏళ్ల కృతం ఆగిపోయిన ఒక సినిమాను ఆయన ఇప్పుడు పూర్తి చేయాలనే ఆలోచనలో ఉంటాడు. 12 ఏళ్ల క్రితం మహదేవన్ (దుల్కర్ సల్మాన్)ను హీరోగా పెట్టి ఆయన తన తల్లి పేరుతో 'శాంత' అనే ఒక సినిమా చేయాలనుకుంటాడు. అయితే ఆ సినిమా కొంత షూట్ జరుపుకున్న తరువాత ఆగిపోతుంది. అలా ఆగిపోయిన సినిమానే ఇప్పుడు అతను పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంటాడు. హీరోగా మహదేవన్ మళ్లీ చేయడానికి ఒప్పుకుంటాడు. హీరోయిన్ గా 'బర్మా'కి చెందిన కుమారి( భాగ్యశ్రీ బోర్సే)ని 'అయ్య' రంగంలోకి దింపుతాడు. షూటింగు సమయంలో మహదేవన్ .. దర్శకుడు ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు కోపంగా ఉండటాన్ని కుమారి చూస్తుంది. కారణం అడిగితే ఇద్దరూ చెప్పరు. కథ .. 'అయ్య' దైరెక్షన్ నచ్చకపోవడంతో, తానే మార్పులు చేసుకుంటూ మహదేవన్ లాగించేస్తూ ఉంటాడు. తన తల్లి పేరుతో తీస్తున్న సినిమాను టైటిల్ తో సహా మార్చడం దర్శకుడికి ఎంతమాత్రం నచ్చదు. ఇక మహదేవన్ తో కుమారికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. వారి ప్రేమ .. పెళ్లి వరకూ వెళుతుంది. ఈ వ్యవహారం కూడా 'అయ్య'కి ఎంతమాత్రం నచ్చదు. ఇక కొత్తగా హీరోయిన్ గా పరిచయం కానున్న కుమారితో మహదేవన్ చనువుగా ఉండటం ఆయన భార్య 'దేవి'కి కూడా ఎంతమాత్రం నచ్చదు. ఈ విషయం మహదేవన్ మామగారి వరకూ వెళుతుంది. ఫలితంగా కుమారికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? మహదేవన్ తో ఆమె పెళ్లి జరుగుతుందా? అసలు మహదేవన్ కీ .. దర్శకుడికి మధ్య గొడవేంటి? అనేది మిగతా కథ. విశ్లేషణ: ఇది 1950లలో .. మద్రాస్ లో ఒక సినిమా స్టూడియో చుట్టూ తిరిగే కథ. ఒక దర్శకుడు .. హీరో .. హీరోయిన్ చుట్టూ తిరిగే కథ. ఈ కథలో .. హీరోను తెరకి పరిచయం చేసిన దర్శకుడే, హీరోయిన్ గా ఓ యువతిని పరిచయం చేయాలనుకుంటాడు. తాను మొదటిసారిగా ఛాన్స్ ఇచ్చిన హీరో జోడీగానే ఆమెను తెరపై చూపించాలని అనుకుంటాడు. అలా ఒక సినిమా ఈ ముగ్గురి జీవితాలను ఎలా ప్రభావితం చేసింది? అనేదే ఈ కథలోని ప్రధానమైన అంశం. సినిమా మొదలైన దగ్గర నుంచి, అసలు హీరోగారికీ .. దర్శకుడికి మధ్య గొడవేంటి అనే సందేహం మనలను వెంటాడుతుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ కి సంబంధించిన సస్పెన్స్ సెకండాఫ్ లో మన ఆలోచనలను అనేక మలుపులు తిప్పుతూ ఉంటుంది. చివరికి వచ్చేసరికి ఒక ట్విస్ట్. ఈ ట్విస్ట్ ఎలా ఉంటుంది? అంటే బాగానే ఉంటుంది. కాకపోతే అక్కడివరకూ ఆడియన్స్ అలా వెయిట్ చేస్తూ కూర్చోవడమే కష్టం. తెరపై కథకు దర్శకుడు 'శాంత' అని టైటిల్ పెట్టుకున్నా, హీరో వచ్చి దానిని 'కాంత'గా మార్చినా ఆడియన్స్ కి ఒరిగిదేమీ లేదు. 1950ల నాటి నేపథ్యాన్ని ఎంచుకున్నారు గాబట్టి, అవుట్ డోర్ కి వస్తే ఇబ్బందే. అందువల్లనే ఫస్టాఫ్ ను.. సెకాండాఫ్ ను స్టూడియోకే పరిమితం చేశారు. షూటింగు హడావిడితో ఫస్టాఫ్ ను .. పోలీస్ ఆఫీసర్ గా రానా హడావిడితో సెకండాఫ్ ను సాగదీయడం వలన ఆడియన్స్ కి కొంత ఇబ్బంది అయితే కలుగుతుంది. పనితీరు: దర్శకుడు తయారు చేసుకున్న ఈ కథ బాగానే ఉంది. కాకపోతే ఇది 'స్టేజ్ ప్లే'కి బాగుటుంది. కథగా చదువుకోవడానికి బాగుంటుంది. కానీ ఇలా సాగదీయడానికి ప్రయత్నిస్తే అసహనమే కలుగుతుంది. 12 ఏళ్ల క్రితం విడిపోయిన హీరో - దర్శకుడు, అదే పంతం .. పట్టింపుతో ఉన్నప్పుడు కలిసి పనిచేయడానికి ఎలా ఒప్పుకుంటారు? అనే ఒక సందేహం ప్రేక్షకులలో అలాగే ఉండిపోతుంది. దుల్కర్ సల్మాన్ .. సముద్రఖని నటనకు వంక బెట్టవలసిన పనిలేదు. భాగ్యశ్రీ అందంగా మెరిసింది. పోలీస్ ఆఫీసర్ గా రానా తన మార్క్ సందడి చూపించాడు. ఇక మిగతా పాత్రలన్నీ ఇలా వచ్చి అలా పోయేవే. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ విషయానికి వస్తే, ఫరవాలేదనిపిస్తాయి. 'ఒక్క అబద్ధం ఎన్నో నిజాలు తెలిసేలా చేస్తుంది' .. 'నాకు మీరిచ్చింది అవకాశమే .. జీవితం కాదు' వంటి కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. ముగింపు: నిజానికి 'కాంత' అనేది చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్. 1950ల నాటి నేపథ్యం కూడా ఆసక్తిని కలిగించేదే. అయితే ఒకే సెట్లో .. నాలుగు గోడల మధ్య ఈ కథను నడిపించడం .. పదే పదే షూటింగు హడావుడి చూపించడం విసుగు తెప్పిస్తుంది. టైటిల్ పరంగా కుతూహలాన్ని రేకెత్తించిన ఈ సినిమా, కంటెంట్ పరంగా ఆశించినస్థాయి వినోదాన్ని అందించలేకపోయిందనే చెప్పాలి. Movie Details Movie Name: Kaantha Release Date: 2025-11-14 Cast: Dulquer Salman,Bhagyashri Borse ,Rana Daggubati,Ravindra Vijay,Nizhalgal Ravi Director: Selvamani Selvaraj Music: Jakes Bejoy Banner: Spirit Media - Wayfarer Films Review By: Peddinti Kaantha Rating: 2.25 out of 5

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :