Monday, 19 January 2026 08:48:51 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Banda Ganesh: బండ్ల గణేశ్ మాటలు షాకింగ్‌గా ఉన్నాయి: బన్నీ వాసు ఆవేదన

Date : 10 October 2025 06:21 PM Views : 286

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : 'లిటిల్ హార్ట్స్' ఈవెంట్‌లో బండ్ల గణేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు అల్లు అరవింద్‌ను పరోక్షంగా టార్గెట్ చేశారంటూ దుమారం వేదికపైనే బండ్ల మాటలను సున్నితంగా ఖండించిన బన్నీ వాసు బండ్ల వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయన్న నిర్మాత ఆ మాటలతో సక్సెస్ మీట్ మూడ్ దెబ్బతిందని ఆవేదన నిర్మాత బండ్ల గణేశ్ నోరు విప్పితే అది సంచలనమే అవుతుంది. ఆయన మాటలు తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంటాయి. ఇటీవల 'లిటిల్ హార్ట్స్' సినిమా విజయోత్సవ సభలో ఆయన చేసిన కొన్ని పరోక్ష వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యల వల్ల తాను ఎంతో బాధపడ్డానని, ఆనాటి సంతోషకరమైన వాతావరణం మొత్తం దెబ్బతిందని నిర్మాత బన్నీ వాసు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఆవేదన వ్యక్తం చేశారు. విషయంలోకి వెళితే, 'లిటిల్ హార్ట్స్' సక్సెస్ మీట్‌లో బండ్ల గణేశ్ మాట్లాడుతూ, “ఇండస్ట్రీలో అందరూ మెగాస్టార్ బావమరిదిలా, స్టార్ కమెడియన్ కొడుకులా, ఐకాన్ స్టార్ తండ్రిలా పుట్టలేరు. కొందరికే ఆ అదృష్టం ఉంటుంది. మిగిలిన వాళ్లు ఎంత కష్టపడ్డా చివరికి పేరు మాత్రం వాళ్లకే వెళ్తుంది” అంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలు అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ను ఉద్దేశించే అన్నారనే చర్చ మొదలైంది. ఆ సమయంలో వేదికపై అల్లు అరవింద్ పక్కనే ఉన్న బన్నీ వాసు... బండ్ల వ్యాఖ్యలకు అసహనానికి గురయ్యారు. వెంటనే మైక్ అందుకున్న బన్నీ వాసు సున్నితంగా బదులిచ్చారు. “అల్లు అరవింద్ గారు స్టార్ కమెడియన్‌కు పుట్టారనడం కరెక్ట్ కాదు. ఆయన పుట్టిన తర్వాతే అల్లు రామలింగయ్య గారు స్టార్ కమెడియన్ అయ్యారు. ఈ విషయం బహుశా బండ్ల గణేశ్ గారికి తెలిసి ఉండకపోవచ్చు” అని అక్కడికక్కడే స్పష్టత నిచ్చారు. అయితే, ఈ వివాదంపై తాజాగా మరోసారి స్పందించిన బన్నీ వాసు, “బండ్ల గణేశ్ చేసిన వ్యాఖ్యలు నిజంగా షాకింగ్‌గా అనిపించాయి. ఇండస్ట్రీకి అల్లు అరవింద్ గారు చేసిన సేవలు అపారమైనవి. అలాంటి వ్యక్తి గురించి అలా మాట్లాడటం నన్ను చాలా బాధించింది. ఆ మాటలతో ఈవెంట్‌లోని సంతోషమంతా పోయింది” అని అన్నారు. కాగా, బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు ఆయన నిజాయతీగా మాట్లాడారని సమర్థిస్తుంటే, మరికొందరు ఓ వేడుకలో వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :