Thursday, 12 March 2026 12:05:11 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం

Date : 07 February 2026 07:29 PM Views : 139

Studio18 News - జాతీయం / : 'హౌడీ మోదీ' కంటే 'నమస్తే ట్రంప్' పైచేయి సాధించిందని ఎద్దేవా రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోదని అర్థమైందన్న జైరామ్ రమేశ్ మన రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలా దిగుమతులపై మన ప్రభుత్వం సుంకాలు తగ్గిస్తుందని విమర్శ భారత్, అమెరికా ట్రేడ్ డీల్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ వ్యంగ్యంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వాణిజ్య ఒప్పందంలో 'హౌడీ మోదీ' కంటే 'నమస్తే ట్రంప్' పైచేయి సాధించిందని పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందంలోని వివరాల ప్రస్తావన సరిగ్గా లేదని అన్నారు. ఈ ఒప్పందం విషయంలో సంయుక్త ప్రకటనలో వివరాలు సరిగ్గా ప్రస్తావించలేదని విమర్శించారు. అయితే భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోదని మాత్రం అర్థమైందని అన్నారు. ఒకవేళ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే మన వస్తువులపై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తామని అమెరికా ప్రకటించిందని అన్నారు. దేశంలోని రైతుల ప్రయోజనాలను దెబ్బతీసి మరీ అమెరికా రైతులకు సహాయం చేకూరేలా దిగుమతులపై మన ప్రభుత్వం సుంకాలు తగ్గించనుందని విమర్శించారు. అమెరికా దిగుమతులు మూడు రెట్లు ఎక్కువగా ఉండటంతో మన వాణిజ్యం తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. మనకు చెందిన ఐటీ, ఇతర సేవల ఎగుమతులపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోందని అన్నారు. ఈ క్రమంలో మన ఎగుమతుల్లోని కొన్ని వస్తువులు గతంలో కంటే ఎక్కువ సుంకాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా ఈరోజు సంయుక్త ప్రకటన చేశాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :