Thursday, 12 March 2026 03:52:06 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

BSF IG | దేశంలో చొరబడేందుకు ఉగ్రవాదులు కాచుకుకూర్చున్నరు : బీఎస్‌ఎఫ్‌ ఐజీ

BSF IG | అంతర్జాతీయ సరిహద్దును దాటుకొని దేశంలోకి చొరబడేందుకు పాకిస్థాన్ (Pakistan) ప్రేరేపిత ఉగ్రవాదులు (Terrorists) చేస్తున్న ప్రయత్నాలను భారత సైన్యం

Date : 27 September 2025 07:58 PM Views : 428

Studio18 News - జాతీయం / : BSF IG : అంతర్జాతీయ సరిహద్దును దాటుకొని దేశంలోకి చొరబడేందుకు పాకిస్థాన్ (Pakistan) ప్రేరేపిత ఉగ్రవాదులు (Terrorists) చేస్తున్న ప్రయత్నాలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. అయినా ఉగ్రవాదులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా నియంత్రణ రేఖ వెంబడి లాంచ్‌ ప్యాడ్స్‌ దగ్గర ఉగ్రమూకలు కాపు కాస్తున్నాయని బీఎస్‌ఎఫ్‌ ఐజీ (BSF IG) అశోక్‌ యాదవ్‌ (Ashok Yadav) తెలిపారు. కశ్మీర్‌ లోయలోకి చొరబడేందుకు ఉగ్రమూకలు నియంత్రణ రేఖ వెంబడి కాపు కాస్తున్నాయని నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు ఆయన వెల్లడించారు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని, చొరబాటుయత్నాలను భగ్నం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శీతాకాలం ప్రారంభానికి ముందు ఉగ్రముఠాలు కశ్మీర్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటాయని అన్నారు. బాందిపొరా, కుప్వారా సెక్టార్లలోని ఎల్‌ఓసీ మీదుగా ఉన్న లాంచ్ ప్యాడ్‌లలో ఉగ్రవాదుల ఉనికి ఉన్నట్లు గుర్తించామని అశోక్‌ యాదవ్‌ తెలిపారు. ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి చొరబడడానికి తగిన సమయం కోసం వేచి చూస్తున్నారని, అయితే వారి చొరబాటు యత్నాన్ని భగ్నం చేయడానికి జమ్ముకశ్మీర్‌లో బీఎస్‌ఎఫ్‌, సైన్యం అలర్ట్‌గా ఉన్నాయని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :