Studio18 News - జాతీయం / : పెళ్లికి ముస్తాబైన ఓ అమ్మాయి ఆ అలంకరణతోనే స్పోర్ట్స్ బైక్ నడిపింది. సాధారణంగా పెళ్లి దుస్తులతో పార్కుల్లో, మంచి లొకేషన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. ఈ అమ్మాయి మాత్రం రెచ్చిపోయి రోడ్లపై బైకు నడుపుతూ వీడియో తీసుకోవడంతో ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ పెళ్లి కూతురి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇట్స్ ట్యుబా44 అనే పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. పెళ్లి అంటే జీవితాంతం గుర్తుండిపోయే వేడుక. ఎన్నో ఆనందకరమైన అనుభవాలను పెళ్లిలో పొందుతూ, వాటిని జీవితాంతం నెమరు వేసుకుంటారు. ఈ అమ్మాయి మాత్రం అటువంటి అనుభవాల కోసం ఇలా వెరైటీగా బైకు నడపడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దేశంలో వివాహాలను ఓ పండుగలా జరుపుకుంటారు. పెళ్లి వేళ చేసే పనులు చిరస్మరణీయంగా ఉండాలని తపించిపోతుంటారు. పెళ్లి దుస్తుల్లో రోడ్లపై ప్రమాదకరంగా ఇలాంటి విచిత్ర పనులు చేస్తే మాత్రం విమర్శలు తప్పవు. అసలు ఈ వీడియోలోని అమ్మాయి పెళ్లి కోసం కాకుండా వీడియో తీసుకోవడం కోసమే పెళ్లి కూతురిగా ముస్తాబు అయినందన్న అనుమానాలు వస్తున్నాయి. ఆమె రోడ్డుపై ఇటువంటి స్టంట్లు ఎన్నో చేసింది.
Admin
Studio18 News