Studio18 News - జాతీయం / : కర్ణాటక రాష్ట్రం మంగళూరు (Mangaluru)లోని లేడీహిల్ (Ladyhill) ప్రాంతంలో గల నారాయణ గురు సర్కిల్ (Narayana Guru Circle) లో ఉన్న ఓ పెట్రోల్ బంక్ (Petrol Pump) వద్ద కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి (Car Catches Fire). అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పెట్రోల్ పంప్ సిబ్బంది నీళ్లు పోసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటల్లో కారు దగ్ధమవుతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
Admin
Studio18 News