Studio18 News - జాతీయం / : Ratan Tata Passed Away: దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మ విభూషణ్ గ్రహీత, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) బుధవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యల కారణంగా ముంబయి బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతూ రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా.. గురువారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా పార్ధివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముంబైలోని వర్లీలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ప్రకటించారు. దివంగత పారిశ్రామికవేత్తకు గౌరవసూచకంగా మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాప దినంగా ప్రకటించింది. గౌరవ సూచకంగా రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని షిండే ప్రకటించారు. కొల్బాలోని నివాసానికి రతన్ టాటా పార్ధివ దేహాన్ని తరలించారు. ఉదయం 10.30 గంటలకు పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం దక్షిణ ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్సీఏపీ) మైదానంలో ఉంచనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 4గంటల తరువాత అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహిస్తారు.
Admin
Studio18 News