Thursday, 05 December 2024 03:09:11 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

టార్గెట్ 2026.. ఏడాది తరువాత అమిత్ షా సమీక్ష.. హాజరుకానున్న సీఎం రేవంత్

Date : 07 October 2024 11:39 AM Views : 41

Studio18 News - జాతీయం / : Amit Shah Review Meeting With CMs: కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో ఇవాళ సమీక్ష సమావేశం జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఏడాది తరువాత సమీక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, హోం మంత్రులు, సీఎస్ లు, డీజీపీలు, కేంద్ర మంత్రులు, పలు కీలక శాఖల కార్యదర్శులు, కేంద్ర సాయుధ బలగాల, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు పాల్గోనున్నారు. 2026 నాటికి మావోయిస్టు సమస్య రూపుమాపడమే లక్ష్యంగా సమీక్ష జరగనుంది. దేశంలో మావోయిస్టు సమస్యను లేకుండా చేయడమే ప్రస్తుత లక్ష్యం అని ఇప్పటికే అమిత్ షా ప్ర‌క‌టించారు. మావోయిస్టుల కట్టడి, కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. అమిత్ షా నిర్వహించే సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ నుంచి హోంమంత్రి అనిత, ఇరు రాష్ట్రాల సీఎస్ లు, డీజీపీలు హాజరు కానున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛతీస్ ఘడ్, కేరళ రాష్ట్రాల మంత్రులు, అధికారులు కూడా హాజరుకానున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుతం ఉన్న భద్రత సమస్య నుంచి ఆ ప్రాంతాలకు విముక్తి కల్పించడం, సమాచార వ్యవస్థ ను నెలకొల్పడం, ఆయా ప్రాంతాల్లో ఏకలవ్య పాఠశాల ఏర్పాటు వంటి కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు కేంద్రం నుంచి చేపట్టే కార్యక్రమాల వివరాలను ఆయా శాఖల కేంద్ర మంత్రులు రాష్ట్రాలకు వివరించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం చేపట్టిన ఆపరేషన్, సాయుధ బలగాల కార్యాచరణ, బలగాల మోహరింపు వివరాలు ఇంటిలిజెన్స్ అధికారులు అందజేయనున్నారు. ఈ సమీక్ష సమావేశంకు కేంద్ర ఆరోగ్య, ఉక్కు, గ్రామీణాభివృద్ధి, గిరిజన వ్యవహారాలు, టెలీకమ్యూనికేషన్లు, తపాలా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శులతోపాటు ఆయా శాఖల మంత్రులు కూడా అందుబాటులో ఉండాలని కేంద్ర హోంశాఖ నుంచి ఇప్పటికే సమాచారం వెళ్లింది. ఇంటిలిజెన్స్, సీఆర్పీఎఫ్, ఎన్ఐఏ, బీఎస్ఎఫ్, ఐటిబిపి డైరెక్టర్లు, జాతీయ భద్రతా సలహాదారు కూడా ఈ సమావేశంకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంకు కేరళ సీఎం, అధికారులు హాజరు కావాలని కేంద్ర హోంశాఖ ఆహ్వానించింది. గత కొన్నేళ్లు మావోయిస్టుల ఏరివేతపై కేంద్రం ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ వ్యూహంతో ఇప్పటికే వామపక్ష తీవ్రవాదం 72శాతం తగ్గింది. హింసాత్మక ఘటనలు తగ్గడంతోపాటు 86శాతం మరణాలు తగ్గాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 202 మంది మావోయిస్టులు హతమయ్యారు. 2026 నాటికి నక్సల్స్ ప్రభావాన్ని పూర్తిస్థాయిలో తగ్గించేందుకు కేంద్రం టార్గెట్ పెట్టుకుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :