Wednesday, 04 March 2026 09:27:02 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

BJP Drops Pune Candidate | ఫడ్నవీస్‌ను విమర్శించినట్లు ఆరోపణలు.. బీజేపీ పూణే అభ్యర్థిని తొలగింపు

BJP Drops Pune Candidate | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఒక మహిళ గతంలో విమర్శించిన వీడియో క్లిప్‌ వైరల్‌ అయ్యింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తల ను

Date : 02 January 2026 06:50 PM Views : 81

Studio18 News - జాతీయం / : ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఒక మహిళ గతంలో విమర్శించిన వీడియో క్లిప్‌ వైరల్‌ అయ్యింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో పూణే పౌర ఎన్నికల్లో ఆ మహిళ అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఉపసంహరించుకున్నది. (BJP Drops Pune Candidate) పూణే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్పీఐ), బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. వార్డ్ నంబర్ 2 అభ్యర్థిగా ఆర్పీఐకు చెందిన పూజా మోర్ జాదవ్‌కు ఏబీ ఫారాన్ని బీజేపీ ఇచ్చింది. దీంతో ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. కాగా, మరాఠా కోటా ఆందోళన సందర్భంగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను పూజా జాదవ్‌ విమర్శించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఆమెకు బీజేపీ ఫారం ఇవ్వడంపై ఆ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఆమె నామినేషన్‌ను బీజేపీ ఉపసంహరించుకున్నది. కేంద్ర మంత్రి, పూణే బీజేపీ ఎంపీ మురళీధర్ మోహోల్ దీనిని ధృవీకరించారు. మరోవైపు సోషల్ మీడియా ట్రోల్స్‌ వల్ల తాను నష్టపోయినట్లు పూజా జాదవ్‌ వాపోయింది. ‘వారు నా గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. బీజేపీ సిద్ధాంతాన్ని నేను నమ్మనని చిత్రీకరించడానికి ప్రయత్నించారు. ఫడ్నవీస్‌ గురించి వ్యాఖలు చేసింది వేరే అమ్మాయి. సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ను నాకు ఆపాదించారు. అందుకే నామినేషన్‌ ఉపసంహరించుకున్నా’ అని ఆమె అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :