Wednesday, 04 March 2026 09:26:22 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

Shashi Tharoor: బంగ్లాదేశ్‌కు వాజ్‌పేయి మాటలతో చురకలంటించిన శశి థరూర్

Date : 19 December 2025 06:24 PM Views : 122

Studio18 News - జాతీయం / : బంగ్లాదేశ్ హింసపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆందోళన అల్లర్ల కారణంగా వీసా కేంద్రాలు మూతపడ్డాయని వెల్లడి భౌగోళిక పరిస్థితులను మార్చలేమన్న వాజ్‌పేయి మాటల ప్రస్తావన భారత్‌తో సత్సంబంధాల విలువ తెలుసుకోవాలని సూచన బంగ్లాదేశ్‌లో చెలరేగుతున్న హింసాత్మక నిరసనలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అల్లర్ల వల్ల సాధారణ బంగ్లాదేశీలకు భారత్ చేసే సాయం తగ్గిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చెప్పిన "భౌగోళిక పరిస్థితులను మార్చుకోలేం" అనే సూక్తిని ఆయన గుర్తుచేశారు. హింస కారణంగా బంగ్లాదేశ్‌లోని రెండు భారత వీసా కేంద్రాలను మూసివేయాల్సి వచ్చిందని థరూర్ తెలిపారు. "భారత్‌కు రావాలనుకునే బంగ్లాదేశీలు వీసాలు సులభంగా రావడం లేదని ఇప్పటికే ఫిర్యాదు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు వారికి మన కేంద్ర ప్రభుత్వం సాయం చేయడాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయి" అని ఆయన అన్నారు. "వాజ్‌పేయి గారు పాకిస్థాన్ గురించి చెప్పినట్టుగా, మనం మన భౌగోళిక పరిస్థితులను మార్చుకోలేం. మాతో కలిసి పనిచేయడం వారు నేర్చుకోవాలి" అని థరూర్ హితవు పలికారు. ఇంక్విలాబ్ మంచ్ అనే సంస్థ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణంతో బంగ్లాదేశ్‌లో తాజాగా అల్లర్లు చెలరేగాయి. గత శుక్రవారం ఢాకాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా... బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి ఆయన మరణించారు. భారత్‌కు, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు హాదీ తీవ్ర విమర్శకుడిగా పేరుపొందారు. హసీనా అధికారం కోల్పోయిన తర్వాత ఏర్పడిన ఇంక్విలాబ్ మంచ్ సంస్థ, బంగ్లాదేశ్‌లో భారత్ ప్రభావానికి వ్యతిరేకంగా పలు నిరసనలు చేపట్టింది. ప్రస్తుతం షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుత పరిస్థితిపై థరూర్ స్పందిస్తూ... ఈ మొత్తం పరిస్థితిని భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని, ఢాకాలోని భారత హైకమిషన్ అధికారులు అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతారని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :