Studio18 News - జాతీయం / : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ (జుట్టు మార్పిడి) చికిత్స మరోసారి విషాదకరంగా మారింది. నగరంలోని ఒక ప్రైవేట్ క్లినిక్‌లో జుట్టు మార్పిడి చేయించుకున్న ఓ ఇంజనీర్ మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. గతంలోనూ ఇదే క్లినిక్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. తాజా ఘటనతో క్లినిక్ నిర్వాహకురాలు డాక్టర్ అనుష్క సింగ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కాన్పూర్‌కు చెందిన ఓ ఇంజనీర్ ఇటీవల స్థానికంగా ఉన్న ఓ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్‌లో చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా, ఇదే తరహా ఘటన గతేడాది సెప్టెంబర్‌లోనూ జరిగింది. సదరు క్లినిక్‌లోనే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స పొందిన అథర్ రషీద్ (30) అనే ఇంజనీర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. చికిత్స అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన రషీద్ సెప్టిసెమిక్ షాక్‌తో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై మృతుడి తల్లి సైరా బానో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రెండు వరుస మరణాల నేపథ్యంలో క్లినిక్ నిర్వాహకురాలు డాక్టర్ అనుష్క సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారని, ఆమె కోసం గాలిస్తున్నామని కాన్పూర్ పోలీసులు వెల్లడించారు. క్లినిక్‌కు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఒకే క్లినిక్‌లో ఇద్దరు వ్యక్తులు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స అనంతరం మృతి చెందడం, అందులోనూ ఇద్దరూ ఇంజనీర్లు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ వరుస ఘటనలతో నగరంలోని హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్‌ల భద్రత, వైద్యుల నైపుణ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Admin
Studio18 News