Thursday, 05 December 2024 03:06:35 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Monkeypox : మంకీపాక్స్ వైరస్ వచ్చేస్తుంది జాగ్రత్త.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు.. దేశంలో తొలికేసు నమోదు

Date : 10 September 2024 11:48 AM Views : 48

Studio18 News - జాతీయం / : Monkeypox virus : ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే కనుమరుగవుతోంది. దాదాపు నాలుగేళ్ల తరువాత కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. దీంతో కరోనా వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోయినట్లేనని భావిస్తున్న సమయంలో మరో వైరస్ టెన్షన్ పెడుతోంది. ఆప్రికన్, యూరోపియన్ దేశాల్లో హడలెత్తించిన మంకీపాక్స్ వైరస్ భారత్ లోకీ ప్రవేశించింది. మంకీపాక్స్ మహమ్మారి తీవ్రతను ఎదుర్కొంటున్న దేశం నుంచి ఇటీవలే భారత్ కు వచ్చిన ఓ యువకుడికి మంకీపాక్స్ వైరస్ పాజిటీవ్ గా నిర్దారణ అయినట్లు ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో మంకీపాక్స్ వైరస్ సోకిన అనుమానిత వ్యక్తిని గుర్తించిన అధికారులు.. ఐసోలేషన్ కు తరలించారు. రోగి నుంచి రక్త నమూనాలను సేకరించి ఎంపాక్స్ నిర్ధారణ కోసం ల్యాబ్ కు పంపించగా.. పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో భారత్ లో మంకీపాక్స్ వైరస్ పై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాణాంతక మంకీపాక్స్ పై కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. మంకీపాక్స్ వైరస్ లక్షణాలు కలిగిన వారిని గుర్తించి పరీక్షలు చేయించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అదేవిధంగా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని చెప్పింది. అయితే, మంకీఫాక్స్ వైరస్ పై ప్రజల్లో అనవసర భయాందోళనలు తలెత్తకుండా చూడాలని, ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర సోమవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ వ్యాప్తి ఆందోళనకర రీతిలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంటుంది. 2022 జనవరి నుంచి 2024 ఆగస్టు వరకు 120 దేశాల్లో లక్షకుపైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని, 220 మంది చనిపోయారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. అమెరికన్ హెల్త్ ఏజెన్సీ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నివేదిక ప్రకారం.. మంకీపాక్స్ వైరస్ సోకిన రోగి లాలాజలం, చెమట, వైరస్ సోకిన వ్యక్తి వినియోగించిన వస్తువుల ద్వారా ఆరోగ్యకరమైన వ్యక్తికి మంకీపాక్స్ వైరస్ ఎటాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీల నుంచి ఆమె బిడ్డకు కూడా ఈ వైరస్ సక్రమిస్తుంది. మంకీపాక్స్ వైరస్ లక్షణాలు కనిపించడానికి ఒకటి నుంచి నాలుగు రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పి, చలి, ఒంటిపై దద్దుర్లు, గొంతు వాపు వంటి లక్షణాలు ఈ వైరస్ సోకిన వారిలో సాధారణంగా కనిపిస్తాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :