Wednesday, 16 July 2025 10:47:25 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

White Tigress Riddhi: భోపాల్ వనవిహార్‌కే అందాన్ని తెచ్చిపెట్టిన తెల్ల ఆడపులి మృతి

Date : 20 September 2024 12:13 PM Views : 185

Studio18 News - జాతీయం / : భోపాల్‌లోని వనవిహార్ నేషనల్ పార్క్‌కే అందాన్ని తెచ్చిపెట్టిన తెల్ల ఆడపులి రిద్ధి మృతి చెందింది. ఎన్‌క్లోజర్‌లో కనువిందు చేసిన ఈ పులి మరణం జంతు ప్రేమికులు, వన విహార్‌ నేషనల్ పార్క్‌ను సందర్శించే వారికి తీరని ఆవేదన మిగిల్చింది. రిద్ధి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని, నిన్న అది ఎన్‌క్లోజర్ వద్ద మృతి చెంది కనిపించిందని పార్క్ అధికారులు తెలిపారు. కొన్ని రోజులుగా అది ఆహారం తీసుకోవడం కూడా మానేసిందని, దీంతో రిద్ధిని అబ్జర్వేషన్‌లో పెట్టినట్టు అధికారులు పేర్కొన్నారు. అయినప్పటికీ అది చలాకీగానే కనిపించిందని తెలిపారు. మార్పిడి కార్యక్రమంలో భాగంగా రిద్ధిని 28 డిసెంబర్ 2013లో ఇండోర్ జూపార్క్ నుంచి భోపాల్ వనవిహార్‌కు తీసుకొచ్చారు. అప్పట్లో దాని వయసు 4 సంవత్సరాలు. ప్రస్తుతం 15 ఏళ్లు. వయసు మీద పడడంతో అవయవాలు పనిచేయకపోవడం వల్లే రిద్ధి మరణించిందని అధికారులు తెలిపారు. దాని నమూనాలను జబల్‌పూర్‌లోని వైల్డ్ లైఫ్ ఫోరెన్సిక్ హెల్త్ స్కూల్‌కు పంపారు. పోస్టుమార్టం అనంతరం పులిని ఖననం చేశారు. అడవిలో నివసించే పులులు సాధారణంగా 15 నుంచి 16 ఏళ్ల వరకు జీవిస్తాయి. అయితే, జూ వంటి సంరక్షణ ప్రాంతాల్లో వాటి జీవితకాలం కొంత ఎక్కువగా ఉంటుంది. వనవిహార్ నేషనల్ పార్క్‌లో ప్రస్తుతం 15 పులులు మాత్రమే ఉన్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :