Studio18 News - జాతీయం / : హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత (ఐఎన్ఎల్ డీ) చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గురుగ్రావ్ లోని తన నివాసంలో కార్డియాక్ అరెస్ట్ తో చౌతాలా చనిపోయారని ఐఎన్ఎల్ డీ వర్గాలు తెలిపాయి. చౌతాలా వయసు 89 ఏళ్లు.. హర్యానా రాజకీయాల్లో చౌతాలా తనదైన ముద్రవేశారు. 1989 నుంచి 2005 వరకు హర్యానాకు ఐదుసార్లు సీఎంగా చౌతాలా సేవలందించారు. వృద్ధాప్యం కారణంగా చౌతాలా కొంతకాలంగా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించడంలేదు.
Also Read : కేశవర్ధిని నూనె అమ్ముతున్న వ్యక్తికి బట్టతల.. యూపీలో కేసు నమోదు
Admin
Studio18 News