Monday, 23 June 2025 02:20:24 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

Siddaramaiah: కర్ణాటక అసెంబ్లీలో 'హనీ ట్రాప్' రగడ... విచారణకు సిద్ధమైన ప్రభుత్వం

హనీ ట్రాప్ వివాదానికి తెరలేపిన మంత్రి రాజన్న సీడీలు ప్రదర్శిస్తూ సభను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులు హనీ ట్రాప్ లో చిక్కుకున్

Date : 21 March 2025 03:46 PM Views : 70

Studio18 News - జాతీయం / : కర్ణాటక అసెంబ్లో హనీ ట్రాప్ దుమారం రేగింది. మంత్రులు సహా అనేకమంది హనీ ట్రాప్ లో చిక్కుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో హనీ ట్రాప్ అంశాన్ని లేవనెత్తారు. పలు సీడీలను ప్రదర్శిస్తూ, అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. హనీ ట్రాప్ అంశంలో నిగ్గు తేల్చాలంటూ సభలో నినాదాలు చేశారు. సీబీఐ దర్యాప్తు కోసం డిమాండ్ చేశారు. ఓ దశలో కాగితాలు చించి విసిరేసిన బీజేపీ ఎమ్మెల్యేలు అదే ఊపులో స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హనీ ట్రాప్ నిజమే అని తేలితే, అందులో ప్రమేయం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరినీ రక్షించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని సిద్ధరామయ్య ఉద్ఘాటించారు. అటు, హనీ ట్రాప్ కలకలం చెలరేగడంతో రాష్ట్ర హోంమంత్రి జి.పరమేశ్వర ఉన్నతస్థాయి కమిటీ విచారణకు హామీ ఇచ్చారు. సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న గురువారం ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. దాదాపు 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ కు గురయ్యారని ఆయన ఆరోపించారు. దీనిపై బీజేపీ నేతలు సీడీలను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చింది. హనీట్రాప్ ఎవరు చేసినా అది తప్పేనని సిద్దరామయ్య అన్నారు. అయితే, బీజేపీ మాత్రం తమ ఆందోళనను విరమించలేదు. ఓ బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, "హనీట్రాప్ కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో ఎంత డబ్బు కేటాయించింది?" అని ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ, "మీకు ఇంకేం కావాలి? విచారణ జరుగుతుందని చెప్పాం కదా" అని అసహనం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు సభను అడ్డుకున్నారు, నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. "ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ - సీడీ ఫ్యాక్టరీ! సదాశివనగర్ సీడీ ఫ్యాక్టరీ!" అంటూ నినాదాలు చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సదాశివనగర్‌లో నివాసం ఉంటున్నందున, ఆయనను లక్ష్యంగా చేసుకుని ఈ నినాదాలు చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :