Monday, 30 March 2026 02:51:32 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Osaf Ali Khan: అత్యాచార నిందితుడ్ని కోర్టు ఆవరణలో చితకబాదిన న్యాయవాదులు... వీడియో వైరల్

Date : 03 February 2026 07:57 PM Views : 114

Studio18 News - జాతీయం / : మైనర్‌పై అత్యాచారం, బ్లాక్ మెయిల్... నిందితుడిపై భోపాల్ కోర్టులో దాడి పోలీసులకు, న్యాయవాదులకు మధ్య తోపులాట, ఉద్రిక్తత వీడియోతో బ్లాక్ మెయిల్ చేసి నిందితుడు డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణ నిందితుడిని కస్టడీలోకి తీసుకుని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు భోపాల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్ కేసులో అరెస్టయిన నిందితుడిని పోలీసులు కోర్టుకు తీసుకురాగా, ఆగ్రహంతో ఉన్న కొందరు న్యాయవాదులు, ప్రజలు అతడిపై దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. వివరాల్లోకి వెళితే, కోహెఫిజా ప్రాంతంలో 11వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసిన కేసులో ఒసాఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. మంగళవారం అతడిని కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకురాగా, అప్పటికే అక్కడ గుమిగూడిన కొందరు న్యాయవాదులు అతడిని చితకబాదారు. పోలీసులు నిందితుడిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ గందరగోళంతో కోర్టు కార్యకలాపాలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఎట్టకేలకు అతికష్టమ్మీద పోలీసులు నిందితుడిని కోర్టు లోపలికి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతేడాది జూలైలో నిందితుడు తనపై అత్యాచారం చేశాడని, ఆ సమయంలో రహస్యంగా వీడియో తీసి దానిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియో బయటపెట్టకుండా ఉండాలంటే లక్ష రూపాయలు డిమాండ్ చేయగా, భయంతో రూ. 40,000 ఇచ్చినట్లు తెలిపింది. అంతేకాకుండా, తన ఇష్టానికి విరుద్ధంగా ఇస్లామిక్ ప్రార్థనలు చేయమని బలవంతం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకుని, అతడి మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి స్నేహితురాలి ద్వారా నిందితుడికి ఆమెతో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :