Sunday, 25 January 2026 05:40:38 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Srilanka PM: శ్రీలంక కొత్త ప్రధాని హరిణి అమరసూర్యకు భారత్‌తో ప్రత్యేక అనుబంధం.. ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో..

Date : 25 September 2024 01:56 PM Views : 329

Studio18 News - జాతీయం / : Srilanka PM Harini amarasuriya : శ్రీలంకలో ఉత్కంఠగా సాగిన అధ్యక్ష ఎన్నికల త్రిముఖ పోరులో మార్క్సిస్టు నేత అనుర కుమార దిసనాయకే విజయం సాధించాడు. రాజపక్స కుటుంబం అవినీతి పాలనకు విసిపోయిన ప్రజలు దిసనాయకేను తమ దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరుసటిరోజే శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య నియమితులయ్యారు. ఈమేరకు ఆమె మంగళవారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. సిరియావో బండారు నాయకే తరువాత శ్రీలంకలో ప్రధాని పదవి చేపట్టిన మహిళా నేత హరిణి కావడం విశేషం. నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్ పీపీ) కి చెందిన 54ఏళ్ల హరిణి అమరసూర్యతో ఆ దేశాధ్యక్షుడు దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమెకు న్యాయ, విద్య, కార్మిక, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక శాఖ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి కీలక శాఖలను కేటాయించారు. ఆమెతోపాటు మరో ఇద్దరు నేతలను క్యాబినెట్ మంత్రులుగా నియమించారు. శ్రీలంకలో హక్కుల కార్యకర్తగా, యూనివర్శిటీ అధ్యాపకురాలిగా హరిణి గుర్తింపు పొందారు. శ్రీలంక నూతన ప్రధాన మంత్రి హరిణి అమరసూర్య కు భారతదేశంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆమె 1991 నుంచి 1994 వరకు ఢిల్లీ యూనివర్శిటీలో సోషియాలజీలో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించారని వార్తా సంస్థ పీటీఏ నివేదించింది. 1990ల ప్రారంభంలో ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలోని హిందూ కళాశాలలో ఆమె చదువుకున్నారు. హిందూ కళాశాల ప్రిన్సిపాల్ అంజు శ్రీవాస్తవ మాట్లాడుతూ.. కళాశాల పూర్వ విద్యార్థి శ్రీలంక ప్రధాని కావటం పట్ల గర్వకారణంగా ఉందని అన్నారు. హరిణి 1991 నుంచి 1994 వరకు సోషియాలజీ విద్యార్థిని. ఆమె సాధించిన విజయాల పట్ల మాకు చాలా గర్వంగా ఉందని అన్నారు. అమరసూర్య.. యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ నుండి సోషల్ ఆంత్రోపాలజీలో డాక్టరేట్ పట్టా కూడా పొందారు. ఆమె అప్లైడ్ ఆంత్రోపాలజీ & డెవలప్‌మెంట్ స్టడీస్‌లో మాస్టర్స్ కూడా చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :